- వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించిన లీ కియాంగ్
బీజింగ్: చైనా ప్రధాని లీ కియాంగ్ గురువారం చైనా, -నేపాల్ సరిహద్దు సమీపంలోని టిబెట్‌లో ఉన్న గ్యిరోంగ్ టౌన్‌షిప్‌ను సందర్శించారు. ఆ ప్రాంతంలో భారీ ఆకస్మిక వరదల కారణంగా తీవ్ర ప్రాణనష్టం వాటిల్లడంతో పాటు 360 మంది గల్లంతైనట్టు సమాచారం అందడంతో స్వయంగా వెళ్లారు. బుధవారం ఉదయం టిబెట్‌లోని గ్యిరోంగ్ టౌన్‌షిప్‌ను ఆకస్మిక వరద ముంచెత్తింది. ఆ ప్రాంతంలోని గ్రామాలు, పట్టణాలు నీట మునిగాయి. దీంతో టిబెట్‌లో ముగ్గురు మరణించారు. వందలాది మంది గల్లంతయ్యారు. దీంతో అధికారుల బృందంతో కలిసి లీ ఆ ప్రాంతానికి వెళ్లినట్టు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది.
