యూపీలో కూలిన శిక్షణ విమానం ఇద్దరు పైలెట్లు మృతి

యూపీలో కూలిన శిక్షణ విమానం ఇద్దరు పైలెట్లు మృతి
  •     ట్రైనింగ్ పూర్తి చేసుకుని వస్తుండగా ప్రమాదం

కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌‌లోని కాన్పూర్‌‌‌‌లో గురువారం ఒక శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు స్పాట్‌‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల ను గుజరాత్‌‌కు చెందిన ఇన్‌‌స్ట్రక్టర్ సచిన్ భాటియా, కర్నాటకకు చెందిన ట్రైనీ పైలెట్ అభిషేక్ పూజారిగా అధికారులు గుర్తించారు. స్థానిక గార్గ్ ఏవియేషన్ శిక్షణ కేంద్రం నుంచి ఉదయం11:30 గంటలకు ట్విన్ -ఇంజిన్ ఫోర్ -సీటర్ ప్లైట్‌‌లో వీరిద్దరూ టేకాఫ్ అయ్యారు. శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి ట్రైనింగ్ సెంటర్‌‌‌‌కు వస్తుండగా 11:50 గంట లకు విమానం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి గంగానది తీరంలో కూలిపోయింది.

ప్రమాదం ధాటికి ప్లైట్ భాగాలు ముక్కలై చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పాట్‌‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మరణించిన ఇన్‌‌స్ట్రక్టర్‌‌‌‌కు సుమారు 3వేల గంటల ప్లైయింగ్ అవర్స్ అనుభవం ఉందని తెలిపారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్​ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కు సమచారం అందించామని.. వారి బృందం వచ్చి సమగ్ర దర్యాప్తు జరపుతుందని చెప్పారు. ప్రస్తుతం స్పాట్‌‌ను తాము ఆధీనంలోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ప్రమాదంలో ధ్వంసమైన విమానాన్ని 2023లోనే ట్రైనింగ్ సెంటర్‌‌‌‌కు తీసుకువచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన పైలెట్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.