ప్రజ్ఞానంద రెండో గేమ్‌‌‌‌ డ్రా

ప్రజ్ఞానంద రెండో గేమ్‌‌‌‌ డ్రా

సెయింట్‌‌ లూసియా (అమెరికా): ఇండియా గ్రాండ్‌‌ మాస్టర్‌‌ ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్‌‌ చెస్‌‌ టూర్‌‌ ఫైనల్లో స్కోరును సమం చేసే అద్భుత అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఫ్యాబియానో కరువాన (అమెరికా)తో గురువారం జరిగిన రెండో క్లాసికల్‌‌ గేమ్‌‌ను 95 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు. గేమ్‌‌ ఆరంభం నుంచి కరువానపై పూర్తి ఆధిపత్యం చూపెట్టిన ప్రజ్ఞా 55వ ఎత్తు వద్ద చిన్న పొరపాటు చేశాడు. దాన్ని సద్వినియోగం చేసుకున్న కరువాన మ్యాచ్‌‌ను డ్రా వైపు తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఇండియన్‌‌ ప్లేయర్‌‌ 3–9 పాయింట్లతో వెనుకంజలో ఉన్నాడు. మూడో స్థానం కోసం జరుగుతున్న పోరులో వెస్లీ సో (అమెరికా, 6), విన్సెంట్‌‌ కీమర్‌‌ (జర్మనీ 6) మధ్య జరిగిన గేమ్‌‌ 41 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఈ టోర్నీలో రెండు ర్యాపిడ్‌‌, నాలుగు బ్లిట్జ్‌‌ గేమ్స్‌‌ మిగిలి ఉన్నాయి.