ద్రవిడ్‌‌, సెహ్వాగ్‌‌ వారసులకు పిలుపు.. భారత్ అండర్‌‌–19 వన్డే జట్టుకు ఎంపిక

ద్రవిడ్‌‌, సెహ్వాగ్‌‌ వారసులకు పిలుపు.. భారత్ అండర్‌‌–19 వన్డే జట్టుకు ఎంపిక

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా అండర్‌‌–19 జట్టుతో తలపడే ఇండియా యంగ్‌‌ టీమ్‌‌ను బీసీసీఐ సెలెక్షన్‌‌ కమిటీ గురువారం ప్రకటించింది. లెజెండ్‌‌ ప్లేయర్లు రాహుల్‌‌ ద్రవిడ్‌‌, వీరేంద్ర సెహ్వాగ్‌‌ తనయులు అన్వయ్‌‌ ద్రవిడ్‌‌, ఆర్యవీర్‌‌ సెహ్వాగ్‌‌.. వన్డే జట్టుకు ఎంపికయ్యారు. గత నెల శ్రీలంక టూర్‌‌కు వెళ్లిన అండర్‌‌–19 జట్టులో ఆడిన 17 ఏళ్ల అన్వయ్‌‌ వికెట్‌‌ కీపర్‌‌ కమ్‌‌ బ్యాటర్‌‌గా రాణించాడు. రెండు యూత్‌‌ మ్యాచ్‌‌ల్లో 14, 87 రన్స్‌‌ చేశాడు. ఇక ఢిల్లీ ప్రీమియర్‌‌ లీగ్‌‌లో ఆడుతున్న 18 ఏళ్ల ఆర్యవీర్‌‌కు జాతీయ అండర్‌‌–19 జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. వచ్చే నెల 18 నుంచి ఆసీస్‌‌తో ఇండియా మూడు వన్డేల సిరీస్‌‌, తర్వాత రెండు మల్టీ డే మ్యాచ్‌‌లు ఆడుతుంది. వన్డే సిరీస్‌‌, తొలి మల్టీ డే మ్యాచ్‌‌లు  రాజ్‌‌కోట్‌‌లో జరగనుండగా, రెండో మల్టీ డే మ్యాచ్‌‌కు అహ్మదాబాద్‌‌ ఆతిథ్యమిస్తుంది.

వన్డే జట్టు: లక్ష్య రాయ్‌‌చందానీ (కెప్టెన్‌‌), యశ్‌‌వర్ధన్‌‌ చౌహాన్‌‌ (వైస్‌‌ కెప్టెన్‌‌), రజత్‌‌ బఘేల్‌‌, ఆర్యవీర్ సెహ్వాగ్, వీకే వినీత్, కుశాగ్ర ఓజా, అర్జున్ రాజ్‌‌పుత్, మనల్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్‌‌, వి. యశ్‍వీర్, రోహిత్ యాదవ్, షవిన్ వినోద్, మోహిత్ ఉల్వా, చిగురుపాటి వెంకట, కావ్య పటేల్.

మల్టీ-డే జట్టు: యశ్‍వర్ధన్ చౌహాన్ (కెప్టెన్), లక్ష్య రాయ్‌‌చందాని (వైస్ కెప్టెన్), సాగర్ విర్క్, కుశాగ్ర ఓజా, మనల్ చౌహాన్, కుశ్ పటేల్, మానవ్ కృష్ణ, అభిప్రాయ్ బిస్వాస్, రోహిత్ యాదవ్, ఇషాద్ ఓమ్, అయాన్ అక్రమ్, ప్రణవ్ రాఘవేంద్ర, ప్రియాన్షు సింగ్, మోహిత్ ఉల్వా, ఆర్యన్ యాదవ్.