WTC Qualification Scenario: శ్రీలంకతో కొలంబోలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025–27 ఫైనల్‌కు అర్హత సాధించాలనే భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఈ ఫలితంతో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా WTC పాయింట్ల పట్టికలో 51.51 శాతంతో (11 మ్యాచ్‌ల్లో 68 పాయింట్లు) 5వ స్థానానికే పరిమితమైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా (80.00%), సౌతాఫ్రికా (75.00%), న్యూజిలాండ్ (72.22%), బంగ్లాదేశ్ (55.56%) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలవగా, ఇండియన్ టీమ్ ఆ 4 జట్ల కంటే వెనుకబడింది.
7 మ్యాచ్‌ల్లో 6 గెలవాల్సిందే:
ది ఓవల్ (The Oval) మైదానంలో జరగనున్న ఫైనల్ సమరానికి అర్హత సాధించాలంటే భారత్‌కు ఇకపై ఏమాత్రం పొరపాట్లు చేయడానికి వీల్లేకుండా పోయింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో టీమిండియాకు ఇంకా 7 టెస్టు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఫైనల్ రేసులో బలంగా నిలవాలంటే ఇండియా ఈ 7 మ్యాచ్‌లలో కనీసం 6 మ్యాచ్‌లను ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. మిగిలిన మ్యాచ్‌ల్లో ఒక్క ఓటమికి మించి ఎదురైనా లేదా డ్రాలు చేసుకున్నా ఫైనల్ అవకాశాలు దాదాపు చేజారినట్లే.
ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిందే:
ఒకవేళ భారత జట్టు మిగిలిన 7 టెస్టుల్లో ఒకదాంట్లో ఓడిపోయి 6 గెలిచినప్పటికీ, నేరుగా అర్హత సాధించడం కష్టమే అవుతుంది. అలాంటి పరిస్థితిలో సౌతాఫ్రికా లేదా ఆస్ట్రేలియా తమ రాబోయే మ్యాచ్‌ల్లో పాయింట్లు కోల్పోతేనే భారత్‌కు టాప్-2లోకి వెళ్లే అవకాశం దక్కుతుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో ఆడబోయే రాబోయే టెస్టు సిరీస్‌లు గిల్ సేనకు అగ్ని పరీక్షగా మారింది.
భారత్ vs శ్రీలంక 2వ టెస్ట్ తర్వాత WTC లెక్కలు:
1. ఆస్ట్రేలియా: 10 మ్యాచ్‌లు ఆడగా, 8 గెలిచింది, 2 ఓడింది, 0 డ్రాలు, 96 పాయింట్లు, 80.00%
2. దక్షిణాఫ్రికా: 4 మ్యాచ్‌లు ఆడింది, 3 గెలిచింది, 1 ఓడిపోయింది, 0 డ్రాలు, 36 పాయింట్లు, 75.00%
3. న్యూజిలాండ్: 6 మ్యాచ్‌లు ఆడింది, 4 గెలిచింది, 1 ఓడింది, 1 డ్రా, 52 పాయింట్లు, 72.22%
4. బంగ్లాదేశ్: 6 మ్యాచ్‌లు ఆడింది, 3 గెలిచింది, 2 ఓడిపోయింది, 1 డ్రా, 40 పాయింట్లు, 55.56%
5. భారత్: 11 మ్యాచ్‌లు ఆడింది, 5 గెలిచింది, 4 ఓడిపోయింది, 2 డ్రాలు, 68 పాయింట్లు, 51.51%
6. శ్రీలంక: 6 మ్యాచ్‌లు ఆడింది, 1 గెలిచింది, 2 ఓడిపోయింది, 3 డ్రాలు, 24 పాయింట్లు, 33.33%
7. ఇంగ్లాండ్: 14 మ్యాచ్‌లు ఆడగా, 5 గెలిచింది, 8 ఓడింది, 1 డ్రా, 14 పాయింట్లు కోత, 50 పాయింట్లు, 29.76%
8. వెస్ట్ ఇండీస్: 12 మ్యాచ్‌లు ఆడారు, 2 గెలిచారు, 8 ఓడిపోయారు, 2 డ్రాలు, 2 పాయింట్లు కోత, 30 పాయింట్లు, 20.83%
9. పాకిస్తాన్: 7 మ్యాచ్‌లు ఆడారు, 2 గెలిచారు, 5 ఓడిపోయారు, 0 డ్రాలు, 8 పాయింట్లు కోత, 16 పాయింట్లు, 19.05%
Sri Lanka's fight ensures that they hold onto their place in the #WTC27 standings 👊
— ICC (@ICC) August 27, 2026
More ➡️ https://t.co/Ag5irO9kgu pic.twitter.com/vPpFPQi4Xf
