వీసా రిజెక్ట్ కావడంతో నేపాల్ వరద నుంచి తప్పిన గండం

వీసా రిజెక్ట్ కావడంతో నేపాల్ వరద నుంచి తప్పిన గండం

కోల్‌‌కతా: కైలాస మానససరోవర యాత్రకు వెళ్లాలనుకున్న ఓ మహిళకు చివరిక్షణంలో చైనా వీసా తిరస్కరించింది. ఆమెతో పాటు దరఖాస్తు చేసి వీసా రావడంతో నేపాల్ వెళ్లిన 32 మంది వరదల్లో గల్లంతయ్యారు. పశ్చిమ బెంగాల్​లోని కోల్‌‌కతాకు చెందిన 61 ఏళ్ల తపతీ సింఘా కైలాస యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

మే నెల నుంచే ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా 13 రోజుల యాత్రకు ప్లాన్ చేసుకున్నారు. గ్రూప్‌‌తో కలిసి ప్రిపరేటరీ మీటింగ్‌‌లు, షాపింగ్ ట్రిప్స్, ట్రెకింగ్ సెషన్లలోనూ పాల్గొన్నారు. ప్రయాణానికి సరిగ్గా కొన్ని రోజుల ముందు కారణం చెప్పకుండానే ఆమె వీసాను చైనా అధికారులు తిరస్కరించారు. తీవ్ర నిరాశకు గురైన ఆమె ఆ ట్రిప్‌‌ను విరమించుకుని దానికి బదులుగా లడఖ్ టూర్‌‌కు వెళ్లారు. అప్పుడు వీసా రిజెక్ట్ కావడం వల్లే ఇప్పుడు ప్రాణాలతో ఉన్నానని తపతీ సింఘా చెప్పారు.