3 రోజుల్లో మరో జల ప్రళయం : ఆధారాలతో అలర్ట్ చేసిన చైనా

3 రోజుల్లో మరో జల ప్రళయం : ఆధారాలతో అలర్ట్ చేసిన చైనా

హిమాలయ ప్రాంతాల్లో భూకంపం తర్వాత ఏర్పడిన జల ప్రళయం నుంచి ఇంకా కోలుకోలేదు ప్రపంచ దేశాలు. గల్లంతు అయిన వాళ్లు బతికి ఉన్నారా లేదా అనేది క్లారిటీ రాలేదు. ప్రళయ విధ్వంసం అంచనా ఊహకు అందని విధంగా ఉంది. సహాయ చర్యలు కొనసాగుతున్న సమయంలోనే.. చైనా దేశం మరో సంచలన విషయం వెలుగులోకి తెచ్చింది. మరో జల ప్రళయం రాబోతుందని.. మరో 3 రోజుల్లో అది జరగొచ్చని నేపాల్ దేశాన్ని అప్రమత్తం చేసింది. దీనికి సంబంధించిన ఆధారాలను విడుదల చేసింది. చైనా ఇచ్చిన అలర్ట్ తో నేపాల్ దేశం హై అలర్ట్ ప్రకటించింది. మూడు రోజుల్లో రాబోతున్న మరో జల ప్రళయం వివరాలు ఇలా ఉన్నాయి. 

హిమాలయ పర్వత శ్రేణుల్లో నేపాల్ దేశం ఎగువ భాగంలోని ఛోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్సో నదులు కలిపే ప్రదేశంలో భారీ సరస్సు ఉంది. కొండల మధ్య.. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ సరస్సులోకి ఇప్పుడు భారీగా నీళ్లు వస్తున్నాయంట. నిన్న జరిగిన పరిణామాలతో.. సహజ సిద్ధంగా ఏర్పడిన సరస్సుల ఆనకట్టలు తెగిపోవటంతో..  పర్వతాల్లోని నీళ్లు వేగంగా కిందకు వస్తున్నాయంట. ఇలా వస్తున్న నీళ్లు అన్నీ..  ఛోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్సో నదులు కలిపే ప్రదేశంలో భారీ సరస్సులోకి వస్తున్నాయంట. 

2026, ఆగస్ట్ 27వ తేదీ మధ్యాహ్నం సమయానికి ఈ సరస్సులో 2 మిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణంలో నీళ్లు ఉన్నాయని.. రాబోయే మూడు రోజుల్లో మరో 3 మిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణంలో నీళ్లు రావొచ్చని స్పష్టంగా చెబుతోంది చైనా దేశం. 

ఇప్పటి అంచనా ప్రకారం.. ఈ సరస్సు అంత నీటిని భరించే స్థాయిలో లేదని.. 5 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీళ్లు వస్తే.. కట్టలు తెగిపోతాయని.. భారీ విధ్వంసం రావటం ఖాయం అని నేపాల్ దేశాన్ని హెచ్చరిస్తూ రిపోర్ట్ విడుదల చేసింది చైనా దేశం. 

టిబెట్ లో పుట్టిన ఈ రెండు నదులు.. చైనా, నేపాల్ దేశ సరిహద్దుల నుంచి ప్రవహిస్తూ.. నేపాల్ దేశంలోని భోటేకోషి ప్రాంతంలో విలీనం అవుతాయని స్పష్టం చేస్తుంది చైనా. కొత్తగా ఏర్పడిన సరస్సు ఆనకట్ట అవకాశం చాలా ఎక్కువగా ఉందని.. ఇదే జరిగితే నిన్నటి జల ప్రళయం కంటే చాలా ఎక్కువగా విధ్వంసం జరగొచ్చని నేపాల్ దేశాన్ని హెచ్చరిస్తూ.. చైనా గ్లోబల్ టైమ్స్, చైనా సెంట్రల్ మీడియా స్పష్టం చేసింది. చైనా లేటెస్ట్ హెచ్చరికలతో నేపాల్ అప్రమత్తం అయ్యింది.