ప్రెగ్నెన్సీ అంటే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనే రోజులు మారుతున్నాయి. వైద్యుల సలహాతో చాలామంది కాబోయే తల్లులు తమకు అనుకూలమైన వ్యాయామాలు చేస్తూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కూడా తన ప్రెగ్నెన్సీ బంప్ తో జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. డిసెంబరులో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న ఈ భామ, కడుపుతో ఉండి కూడా బరువులు ఎత్తుతూ ఫ్యాన్స్‌కు మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చింది.
లేటెస్ట్ గా సమంత షేర్ చేసిన వీడియోల్లో సీటెడ్ కేబుల్ రో, వెయిట్స్ లిఫ్టింగ్ వంటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు కనిపించాయి. అయితే గతంలోలా మరింత బరువు ఎత్తడం, హద్దులు దాటడం తన లక్ష్యం కాదని ఆమె చెబుతోంది. ఇప్పుడు గట్టిగా నెట్టడం కంటే.. నా శరీరం ఏం చెబుతుందో వినడమే ముఖ్యం అనే భావనతో తన ట్రైనింగ్‌ను మార్చుకున్నట్లు వెల్లడించింది.
నా శక్తిలో 70 శాతం దగ్గరే ఆపేస్తాను. కొన్ని రోజులు స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. మరికొన్ని రోజులు వర్కౌట్‌ను మార్చుకుంటాను. ఇంకొన్ని రోజుల్లో నేలపై పడుకోవడమే వర్కౌట్ అంటూ సమంత సరదాగా చెప్పింది. నా శరీరాన్ని ఇంకా ఎక్కువ చేయడానికి ట్రైన్ చేశాను. ఇప్పుడు అది విశ్రాంతి కోరితే గౌరవించడం నేర్చుకుంటున్నాను. ఒక చిన్న ప్రాణాన్ని పెంచుతున్నప్పుడు లక్ష్యాలు కూడా మారిపోతాయి. అదే నా శరీరం చేసిన అత్యంత బలమైన పని కావచ్చు అంటూ తన అనుభూతిని పంచుకుంది.
అంతేకాదు.. తాను ఎన్నో ఏళ్లుగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తున్నానని, ప్రెగ్నెన్సీలోనూ డాక్టర్ అనుమతితోనే కొనసాగిస్తున్నానని స్పష్టం చేసింది. తన ట్రైనర్ ప్రీనేటల్ ట్రైనింగ్‌లో సర్టిఫైడ్ అని, తన శరీరం, అనుభవం, ప్రెగ్నెన్సీకి తగ్గట్టుగా ప్రతి వ్యాయామాన్ని మార్చి చేస్తున్నారని తెలిపింది. అదే సమయంలో నా వర్కౌట్స్‌ను చూసి మీరు కూడా అవే చేయొద్దు. ప్రతి ప్రెగ్నెన్సీ భిన్నమైనది. డాక్టర్‌ను సంప్రదించి, అర్హత కలిగిన నిపుణుల పర్యవేక్షణలోనే వ్యాయామం చేయండి అంటూ కీలక సూచన చేసింది.
ALSO READ : Sandeep Reddy Vanga: ప్రభాస్ 'స్పిరిట్'కి A సర్టిఫికేట్ ఖాయం..
సమంత-రాజ్ నిడిమోరు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్త ఇప్పటికే అభిమానుల్లో ఆనందం నింపింది. ఇటీవల బేబీమూన్ ఫొటోలతో సందడి చేసిన సామ్.. ఇప్పుడు తన ఫిట్‌నెస్ వీడియోలతో మరోసారి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. హీరోయిన్‌గా మాత్రమే కాదు.. ఈ కొత్త జీవిత దశలోనూ తన శరీరాన్ని గౌరవిస్తూ సాగుతున్న సమంత తీరు ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది..
