టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన బోల్డ్ యాక్షన్, హై-వోల్టేజ్ ఎమోషన్లతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాలతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్ అందించిన ఈ కల్ట్ మేకర్.. ప్రస్తుతం -పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్‌తో 'స్పిరిట్' తీస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా తాను నిర్మిస్తున్న 'రోమాంచకం' ట్రైలర్ లాంచ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సందీప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతున్నాయి.
'స్పిరిట్' మూవీకి ఏ సర్టిఫికేట్..
తన హోమ్ బ్యానర్ భద్రకాళీ పిక్చర్స్‌లో తెరకెక్కిన 'రోమాంచకం' చిత్రానికి ఫస్ట్ టైమ్ క్లీన్ U/A సర్టిఫికేట్ వచ్చిందని సందీప్ రెడ్డి చెప్పారు. కానీ ప్రభాస్ 'స్పిరిట్' మూవీకి మాత్రం కచ్చితంగా వియోలెంట్ 'A' (Adults Only) సర్టిఫికేటే వస్తుందని క్లారిటీ ఇచ్చేశారు. విజువల్స్ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో ఈ ఒక్క మాటతో మైండ్ బ్లాక్ చేశారు.
యాంగ్రీ కాప్ పాత్రలో ప్రభాస్..
ఈ 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇప్పటివరకు చూడని డిఫరెంట్ షేడ్స్‌లో.. రా అండ్ రస్టిక్ అవతార్‌లో డార్లింగ్ అలరించబోతున్నారు. ఇక ప్రభాస్ సరసన గ్లామరస్ బ్యూటీ త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 'యానిమల్' మూవీకి బిజిఎమ్‌తో పూనకాలు తెప్పించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
టి-సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2027, మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. వంగా మార్క్ రా యాక్షన్, ప్రభాస్ కటౌట్ తోడు కావడం వల్లే 'స్పిరిట్'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయం అని సినీ వర్గాలతో పాటు ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..
