మానస సరోవర్ వెళ్లే.. నేపాల్, చైనా సరిహద్దులు మాయం : పెద్ద పెద్ద బిల్డింగ్స్ కొట్టుకుపోయాయి..

మానస సరోవర్ వెళ్లే.. నేపాల్, చైనా సరిహద్దులు మాయం : పెద్ద పెద్ద బిల్డింగ్స్ కొట్టుకుపోయాయి..

నేపాల్ చైనా బార్డర్ లో రాకాసి వరదలు విలయ తాండవం చేశాయి.ఆకస్మికంగా వచ్చిన వరద ధాటికి ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. వరదలకు సంబంధించిన వీడియోలు చూస్తుంటేనే వణుకు పుడుతోంది. నేపాల్ చైనా బార్డర్ క్రాసింగ్ దగ్గర వచ్చిన వరద ధాటికి పెద్ద బిల్డింగ్ కూడా మాయమైపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలోకి వరద నీరు ఉధృతంగా దూసుకువస్తున్న దృశ్యాలు సెక్యూరిటీ కెమెరాలో రికార్డయ్యాయి. ఏకంగా బిల్డింగ్ మొత్తాన్ని తుడిచిపెట్టుకుపోయింది వరద నీరు. ఘటన జరిగిన సమయంలో ప్రాణభయంతో పరుగులు తీశారు జనం. ఈ ఘటనలో 17 మంది మరణించారని స్థానికులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరో పక్క టిబెట్ లో కూడా భారీ ప్రాణనష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు.

నేపాల్ చైనా బార్డర్ నుంచి మానస సరోవర్ కు వెళ్లిన 400 మంది యాత్రికులు గల్లంతయ్యారు. వారిలో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం 3 గంటల నుంచి గల్లంతైన యాత్రికులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నామని అంటున్నారు అధికారులు.