ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ఉన్నత చదువులు చదవాలనుకునే నిరుపేద విద్యార్థినులకు 'కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్' గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంజినీరింగ్, మెడిసిన్ (ఎంబీబీఎస్/ బీడీఎస్), లా, ఫార్మసీ, డిజైన్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం పొందిన అమ్మాయిల కోసం కోటక్ కన్య స్కాలర్‌షిప్-–2026 దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఎంపికైన విద్యార్థినికి కోర్సు పూర్తయ్యే వరకు ఏటా రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థినులు అక్టోబర్ 15లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలిజిబిలిటీ:
- ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు లేదా సమాన సీజీపీఏ సాధించి ఉండాలి.
- విద్యార్థిని కుటుంబ వార్షిక ఆదాయం రూ.6,00,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రేమ్‌వర్క్/ నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ప్రముఖ విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ (ఐదు సంవత్సరాలు), బి.ఫార్మ్, బీఎస్సీ (నర్సింగ్, డిజైన్, ఆర్కిటెక్చర్) లేదా ఐఐఎస్ఈఆర్, ఐఐఎస్ సీల్లో ఇంటిగ్రేటెడ్ బీఎస్ఎంఎస్ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశం పొంది ఉండాలి.
అవసరమైన డాక్యుమెంట్స్:
- 12వ తరగతి మార్కుల మెమో
- తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ పత్రం లేదా ఐటీఆర్
- ప్రస్తుత విద్యా సంవత్సరపు ఫీజు స్ట్రక్చర్ లేదా అడ్మిన్ ఆఫర్ లెటర్
- కాలేజీ బోనఫైడ్ సర్టిఫికెట్
- విద్యార్థిని ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- లాస్ట్ డేట్: 2026, అక్టోబర్ 15.
- మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.kotakeducationfoundation.org/ kotak–kanya-–scholarshipను సందర్శించండి.
సెలెక్షన్ ప్రాసెస్
- అప్లికేషన్ స్క్రీనింగ్: విద్యార్థుల అప్లికేషన్, ధ్రువీకరణ పత్రాలను నిర్దేశిత అర్హత ప్రమాణాల (మార్కులు, కుటుంబ ఆదాయం, కోర్సు తదితరాలు) ఆధారంగా పరిశీలిస్తారు.
- అకడమిక్ మెరిట్, నేపథ్య పరిశీలన: 12వ తరగతిలో సాధించిన మార్కులు, ఆర్థిక నేపథ్యాన్ని అనుసరించి షార్ట్‌లిస్ట్ చేస్తారు. అత్యంత నిరుపేద, ప్రతిభావంతులైన విద్యార్థినులకు ప్రాధాన్యత ఇస్తారు.
- పర్సనల్ ఇంటర్వ్యూ: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఆన్లైన్ లేదా ఫోన్ ద్వారా రెండు దశల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా విద్యార్థి ప్రతిభ, లక్ష్యాలు, చదువుపై ఆసక్తిని అంచనా వేస్తారు.
- ఫైనల్ సెలెక్షన్: ఇంటర్వ్యూలో కనబర్చిన ప్రతిభ, ఇతర అర్హతల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్టును ప్రకటిస్తారు. ర్యాంకుల ఆధారంగా ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలించి స్కాలర్‌షిప్ మంజూరు చేస్తారు.
ఆర్థిక సాయం:
ఎంపికైన ప్రతి విద్యార్థినికి ఏడాదికి రూ.1,50,000 వరకు ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ మొత్తాన్ని ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఛార్జీలు, ల్యాప్‌టాప్ కొనుగోలు, పుస్తకాలు, స్టేషనరీ, ఇంటర్నెట్/ రవాణా ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ ఆర్థిక సహాయం ఏడాదికి మాత్రమే పరిమితం కాదు.
విద్యార్థిని ఎంచుకున్న ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి ఏటా రెన్యువల్ చేస్తారు. అయితే, ప్రతి ఏడాది కనీసం 6 సీజీపీఏ కలిగి ఉండాలి. లేదా ఆ తర్వాత అకడమిక్ ఇయర్‌కు వెళ్లేందుకు అర్హత సాధించాలి. రెగ్యులర్ అకడమిక్ సెషన్స్ డ్రాపవుట్కి ఉపకార వేతనం నిలిపివేస్తారు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు కొటాక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రతినిధులు పరిశీలిస్తుంటారు.
