కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. 2025 సంవత్సరానికిగాను 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు, అర్జున జీవిత సాఫల్య పురస్కారం, ద్రోణాచార్య అవార్డులు, ద్రోణాచార్య జీవన సాఫాల్య పురస్కారాలను ప్రకటించింది. వీరికి ఆగస్టు 29న మేజర్ ధ్యాన్ చంద్ జయంతి రోజు సందర్భంగా నిర్వహించే క్రీడా దినోత్సవాల్లో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
అర్జున అవార్డులు: పుల్లెల గాయత్రి, ట్రీసా జాలీ (బ్యాడ్మింటన్), ధనుష్ శ్రీకాంత్ (బధిర షూటర్), దివ్య దేశ్‌ముఖ్, విదిత్ గుజరాతీ(చెస్), తేజస్విన్ శంకర్ (డెకాథ్లెట్, హైజంపర్), నరేందర్ బెర్వాల్ (బాక్సర్), రాజ్‌కుమార్ పాల్ (హాకీ), ప్రియాంక గోస్వామి (రేస్ వాక్ అథ్లెట్), ఏక్తా భైయాన్ (క్లబ్ త్రోయర్), రుద్రాంశ్ ఖండేల్వాల్ (పారా షూటర్), సుర్జీత్, పూజ (కబడ్డీ), అర్వింద్ సింగ్ (రోయర్), అఖిల్ షెరాన్ (షూటర్), లాల్రెమ్సియామి (హాకీ), మహ్మద్ అజ్మల్ (స్ప్రింటర్).
అర్జున జీవిత సాఫల్య పురస్కారం: మాజీ ఫుట్ బాలర్ అరుమైనాయగం.
ద్రోణాచార్య అవార్డులు: కోచ్‌లు పర్వీర్ సింగ్ (అథ్లెటిక్స్), ఛోటేలాల్ యాదవ్ (బాక్సింగ్), నేహా చవాన్ (షూటింగ్).
ద్రోణాచార్య జీవన సాఫాల్య పురస్కారాలు: ధర్మేంద్ర యాదవ్ (బాక్సింగ్), వీరేందర్ కుమార్ (రెజ్లింగ్).
కమిటీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని అవార్డుల ఎంపిక కమిటీలో దిగ్గజ షూటర్ గగన్ నారంగ్, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అపర్ణా పోపట్, హాకీ మాజీ ప్లేయర్ ఎంఎం సోమయ ఉన్నారు.
మిస్ యూనివర్స్ ఇండియా విజేత కజియా; మిస్ యూనివర్స్ ఇండియా – 2026 కిరీటాన్ని కేరళకు చెందిన కజియా లిజ్ మెజో దక్కించుకున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో 52 మంది పోటీపడగా, వారందరిని వెనక్కి నెట్టి ఆమె ఈ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.
ఫస్ట్ రన్నరప్: వైష్ణవి గణేష్ (తమిళనాడు). ఈమె మిస్ ఇంటర్నేషనల్ ఇండియా–2026 టైటిల్‌ను కూడా దక్కించుకున్నారు.
సెకండ్ రన్నరప్: అనుశ్రీ సతవ్లేకర్ (గుజరాత్).
మిస్ యూనివర్స్ ఇండియా విజేత కజియా నవంబర్‌లో ప్యూర్టో రికోలో జరగనున్న అంతర్జాతీయ 75వ మిస్ యూనివర్స్ వేదికపై భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
