రాఖీ పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న జనం... హైదరాబాద్ లో కిక్కిరిసిన బస్టాండ్లు..!

రాఖీ పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న జనం... హైదరాబాద్ లో కిక్కిరిసిన బస్టాండ్లు..!

రాఖీ పండగ వచ్చేసింది.. అన్నా చెల్లెళ్ళ బంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ జరుపుకునేందుకు సిటీ నుంచి సొంతూళ్లకు బయలుదేరారు జనం. ఈ క్రమంలో గురువారం ( ఆగస్టు 27 ) హైదరాబాద్ లోని బస్టాండ్లన్నీ కిటకిటలాడాయి. పల్లెలకు బయలుదేరిన జనంతో కిక్కిరిసిపోయాయి MGBS, JBS వంటి ప్రధాన బస్టాండ్లు.

ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర ఫ్లైఓవర్ పనుల కారణంగా నల్లచెరువు పక్కన తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేశారు ఆర్టీసీ అధికారులు.ఇక్కడి నుండి హన్మకొండ,వరంగల్ ,నర్సంపేట, జనగాం, యాదగిరి గుట్ట , తొర్రూరు వెళ్లే బస్సులు  అపరెట్ చేస్తోంది ఆర్టీసి.రేపే రాఖీ పండుగ కావడంతో వివిధ ప్రాంతాల నుండి నల్లచెరువు ఉప్పల్ బస్ స్టాప్ దగ్గరికి చేరుకున్నారు వస్తున్నారు ప్రయాణికులు

రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరిగిన క్రమంలో అదనపు సర్వీసులు కూడా ఏర్పాటు చేసింది ఆర్టీసీ. ఇదే రద్దీ ఆగస్టు 28, 31 తేదీల్లో కూడా కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. రద్దీ కారణంగా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చర్యలు చేపట్టామని తెలిపారు అధికారులు. అయితే, స్పెషల్ బస్సుల్లో సాధారణ చార్జీల కంటే 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తోంది ఆర్టీసీ.

ఇదిలా ఉండగా... రాఖీ పండగతో పాటు వీకెండ్ కూడా కలిసి రావడంతో ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు సిటీ జనం. ఉరుకులు, పరుగుల జీవితం వదిలి ప్రక్రుతి ఒడిలో సేదతీరేందుకు హైదరాబాద్ కి దగ్గర్లో ఉన్న జలపాతాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారు జనం. మరి మీరు రాఖీ పండుగకు సొంతూళ్లకు వెళ్తున్నారా లేక వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..?