ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన సత్తా చాటారు. లేటెస్ట్ గా ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్ 'ఫోర్బ్స్ ఇండియా' (Forbes India) ప్రకటించిన 'షోస్టాపర్స్ 2026' కవర్ పేజీపై మన పుష్ప రాజ్ మెరిసి.. తెలుగు సినిమా సత్తాను గ్లోబల్ లెవెల్‌లో మరోసారి చాటిచెప్పారు. దేశవ్యాప్తంగా సినిమాలు, ఓటీటీ, క్రీడలు, సంగీతం, టెలివిజన్ తదితర రంగాల్లో ప్రభావం చూపుతున్న 100 మంది ప్రముఖులతో రూపొందించిన ఈ ప్రత్యేక సంచికలో అల్లు అర్జున్ కు దక్కిన స్థానం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
'ఫోర్బ్స్ ఇండియా' కవర్ స్టార్‌గా...
2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు చలనచిత్ర రంగాన్ని, క్రీడలను, సంగీతాన్ని ఏలిన 100 మంది అత్యంత ప్రముఖులతో కలిపి ఈ ప్రతిష్టాత్మక జాబితాను రూపొందించారు. అందులో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్, సూపర్‌స్టార్ రజనీకాంత్, రన్-మెషిన్ విరాట్ కోహ్లీ, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ... కవర్ స్టార్‌గా నిలబడే ఏకైక పవర్ మాత్రం అల్లు అర్జున్‌కే దక్కింది. టాలీవుడ్ నుంచి కేవలం అల్లు అర్జున్, రామ్ చరణ్ మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం మరో విశేషం..
కథే అసలైన 'బాస్' ...
ఈ కవర్ స్టోరీ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ బాక్సాఫీస్ లెక్కలు, సినిమా భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కథే అసలైన 'బాస్' అని చెప్పారు. సినిమా ప్రాంతీయమైనదా, హిందీనా లేక పాన్-ఇండియానా అనేది ముఖ్యం కాదు. సరైన కంటెంట్, కొత్తదనం ఉన్న కథ ఉంటే ఏ భాషలోనైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. స్టార్‌డమ్ కంటే కథలోని దమ్ము మాత్రమే విజయాన్ని డిసైడ్ చేస్తుంది అని బలంగా చెప్పారు. కొత్త కథను ప్రేక్షకులకు అందించడమే సినీ పరిశ్రమ ముందున్న అసలు సవాల్ అని పేర్కొన్నారు.
ALSO READ : రజినీకాంత్ 'జైలర్ 2'తో విజయ్ దేవరకొండ పోటీ..
25కు పైగా బ్రాండ్ లకు ..
అల్లు అర్జున్ నటనలోనే కాకుండా వ్యాపార ప్రకటనల్లోనూ తన హవా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 25కు పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ డిమాండ్‌లో అగ్రస్థానంలో ఉన్నారు. ఇక ఈ ఏడాది 'షోస్టాపర్స్'జాబితాలో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, రామ్ చరణ్ మాత్రమే చోటు దక్కించుకోవడం కూడా ప్రత్యేక చర్చగా మారింది.
బాక్సాఫీస్ ఫినామినన్‌గా..
జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ, సరికొత్త బెంచ్ మార్క్స్ సెట్ చేస్తున్నారు అల్లు అర్జున్. ఒకప్పుడు ‘స్టైలిష్ స్టార్’గా అభిమానుల మనసులు గెలుచుకున్న బన్నీ.. ఇప్పుడు పాన్-ఇండియా ఐకాన్‌గా, బ్రాండ్ పవర్‌హౌస్‌గా, బాక్సాఫీస్ ఫినామినన్‌గా తన స్థాయిని మరోసారి నిరూపించారు. ఫోర్బ్స్ కవర్‌పై మెరిసిన ఈ పుష్పరాజ్‌ప్రయాణం.. ఇక గ్లోబల్ స్టేజ్ వైపు సాగుతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు సినీ వర్గాలు.
National Award-winning actor and box office phenomenon @alluarjun is the cover star of Forbes India’s Showstoppers 2026 edition, featuring India’s 100 biggest celebrities. The top pan-India superstar opens up about his craft, mass appeal and brand persona pic.twitter.com/hfsEqsRhk9
— Forbes India (@ForbesIndia) August 27, 2026
