Ranabali Release Date : రజినీకాంత్ 'జైలర్ 2'తో విజయ్ దేవరకొండ పోటీ.. 'రణబాలి' కొత్త రిలీజ్ డేట్ ఇదే!

Ranabali Release Date : రజినీకాంత్ 'జైలర్ 2'తో విజయ్ దేవరకొండ పోటీ.. 'రణబాలి' కొత్త రిలీజ్ డేట్ ఇదే!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం 'రణబాలి'.  రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ విజువల్ వండర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  'గీత గోవిందం',' డియర్ కామ్రేడ్' వంటి హిట్ల తర్వాత రియల్ లైఫ్ జోడీగా మారిన వీరు కలిసి నటిస్తున్న తొలి మూవీ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

లేటెస్ట్ గా ఈ క్రేజీ మూవీ గురించి  కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్.  తొలుత ఈ సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, రవీంద్ర పుల్లే దర్శకత్వంలో రష్మిక నటిస్తున్న 'మైసా' యాక్షన్ చిత్రంలో ఒక పాట చిత్రీకరణ సందర్భంగా ఆమెకు బలమైన గాయమైంది. వైద్యుల సూచన మేరకు ఆరు వారాల విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో 'రణబాలి' షూటింగ్ కాస్త ఆలస్యమైంది.  

ఇప్పుడు రష్మిక కోలుకోవడంతో, చిత్రబృందం ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌తో కొత్త రిలీజ్ డేట్‌ను లాక్ చేసింది. అక్టోబర్ 16, 2026న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. అయితే, అదే సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్ 2' కూడా బరిలో ఉండటంతో బాక్సాఫీస్ వద్ద దసరాకి ఊహించని బిగ్ క్లాష్ ఖాయంగా కనిపిస్తోంది.

 'రణబాలి' మూవీని19వ శతాబ్దంలో (1854 - 1878) బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన కొన్ని వాస్తవ ఆధారిత సంఘటనల నేపథ్యంలో ఈ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ ఇప్పటివరకు చూడని ఒక వీరోచిత యోధుడి పాత్రలో కనిపిస్తుండగా, ఆయన మేకోవర్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్నారు. 

ALSO READ : స్టార్ డమ్ తలకెక్కిందా? పీఏతో చెప్పులు మోయిస్తారా ?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' సమర్పణలో, 'టీ-సిరీస్' కాంబినేషన్ లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పెళ్లి తర్వాత విజయ్-రష్మికల తొలి సినిమా కావడం, దానికితోడు పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ కావడంతో 'రణబాలి' బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయం అని చిత్ర బృందంతో పాటు ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.