నేటి నుంచే మహిళల ఆసియా కప్ టోర్నీ స్టార్ట్: భారత్–పాక్ మ్యాచ్ ఆరోజే?.. పూర్తి షెడ్యూల్ ఇదే!

నేటి నుంచే మహిళల ఆసియా కప్ టోర్నీ స్టార్ట్: భారత్–పాక్ మ్యాచ్ ఆరోజే?.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Women’s T20 Asia Cup 2026: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. దుబాయ్ వేదికగా ఈరోజే మహిళల ఆసియా కప్ 2026 ధనాధన్ సమరం షురూ కానుంది. మొత్తం 8 ఆసియా జట్లు కప్పు కోసం తలపడుతుండగా, మ్యాచ్‌లన్నీ ప్రతిరోజూ రాత్రి 8 గంటలకి జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక టైటిల్ నిలబెట్టుకోవాలని చూస్తుంటే,  టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సేన కప్పును తిరిగి అందుకోవాలనే కసితో బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా సెప్టెంబర్ 5వ తేదీన జరగబోయే హై-వోల్టేజ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ పోరు కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ బిగ్ టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్, లైవ్ ప్రసారాలు, భారత జట్టు వివరాలు ఏంటో ఇప్పుడు V6 వెలుగు వార్త సంస్థలో చూసేద్దాం..

టీమిండియాకు సవాల్.. జెమిమా ఔట్, ప్రతీక ఇన్: 

ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించి నిరాశపరిచిన భారత జట్టుకు ఈ ఆసియా కప్ తిరిగి పుంజుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా భారత్‌ను నడిపిస్తున్నారు. కానీ ది హండ్రెడ్ టోర్నీలో తొడ కండరాల గాయానికి గురైన స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ ఈ టోర్నీకి దూరం కాగా, ఆమె స్థానంలో ప్రతీక రావల్ భారత జట్టులోకి వచ్చింది. మరోవైపు శ్రీలంక ఆల్‌రౌండర్ దేవ్‌మి విహంగ మోకాలి గాయంతో టోర్నీ నుంచి తప్పుకోగా నిమాషా మీపేగే జట్టులోకి వచ్చింది. అలాగే బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ఫరీహా ఇస్లామ్ త్రిష్ణా గాయంతో దూరమవ్వగా ఫర్జానా యాస్మిన్ ఎంపికైంది. భారత్ తన తొలి మ్యాచ్‌ని ఆగస్టు 30న థాయిలాండ్‌తో, సెప్టెంబర్ 3న హాంగ్‌కాంగ్‌తో ఆడనుంది.  

ఏ జట్టు ఏ గ్రూపులో ఉందంటే: 

* గ్రూప్ ఏ: భారత్, పాకిస్తాన్, థాయిలాండ్, హాంగ్‌కాంగ్ (చైనా)
* గ్రూప్ బీ: శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ, ఇండోనేషియా

మ్యాచుల ప్రత్యక్ష ప్రసార వివరాలు: 

* సమయం: ఆసియా కప్ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం ప్రతిరోజూ రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతాయి.

* టీవీ ఛానెల్: సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Sony Sports Network).

* లైవ్ స్ట్రీమింగ్: సోనీ లివ్ (Sony LIV) యాప్.

మహిళల ఆసియా కప్ పూర్తి షెడ్యూల్:

* ఆగస్టు 28: థాయిలాండ్ వర్సెస్ హాంగ్‌కాంగ్ (రాత్రి 8:00)
* ఆగస్టు 29: శ్రీలంక వర్సెస్ యూఏఈ (రాత్రి 8:00)
* ఆగస్టు 30: భారత్ వర్సెస్ థాయిలాండ్ (రాత్రి 8:00)
* ఆగస్టు 31: బంగ్లాదేశ్ వర్సెస్ ఇండోనేషియా (రాత్రి 8:00)
* సెప్టెంబర్ 1: పాకిస్తాన్ వర్సెస్ థాయిలాండ్ (రాత్రి 8:00)
* సెప్టెంబర్ 2: శ్రీలంక వర్సెస్ ఇండోనేషియా (రాత్రి 8:00)
* సెప్టెంబర్ 3: భారత్ వర్సెస్ హాంగ్‌కాంగ్ (రాత్రి 8:00)
సెప్టెంబర్ 4: యూఏఈ వర్సెస్ ఇండోనేషియా (రాత్రి 8:00)
* సెప్టెంబర్ 5: భారత్ వర్సెస్ పాకిస్తాన్ (రాత్రి 8:00)
* సెప్టెంబర్ 6: శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ (రాత్రి 8:00)
సెప్టెంబర్ 7: పాకిస్తాన్ వర్సెస్ హాంగ్‌కాంగ్ (రాత్రి 8:00)
* సెప్టెంబర్ 8: బంగ్లాదేశ్ వర్సెస్ యూఏఈ (రాత్రి 8:00)
* సెప్టెంబర్ 10: సెమీఫైనల్-1 (రాత్రి 8:00)
* సెప్టెంబర్ 11: సెమీఫైనల్-2 (రాత్రి 8:00)
* సెప్టెంబర్ 13: ఫైనల్ (రాత్రి 8:00)

టోర్నీలో పాల్గొంటున్న జట్ల స్క్వాడ్‌లు:

భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి కమలిని (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, ప్రేమా రావత్, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, నందిని శర్మ, క్రాంతి గౌడ్, ప్రతీక రావల్.

పాకిస్తాన్: ఫాతిమా సనా (కెప్టెన్), ఆయేషా జఫర్, ఇమాన్ నసీర్, ఐమాన్ ఫాతిమా, గుల్ ఫిరోజా, మోమినా రియాసత్, మునీబా అలీ (వికెట్ కీపర్), సదఫ్ షమాస్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్, సైరా జబీన్, షావాల్ జుల్ఫికర్, తూబా హసన్, ఉమ్-ఎ-హానీ, వహీదా అక్తర్.

బంగ్లాదేశ్: నిగార్ సుల్తానా జోతీ (కెప్టెన్), నాహిదా అక్టర్ (వైస్ కెప్టెన్), దిలారా అక్టర్, ఫర్జానా యాస్మిన్, జువైరియా ఫెర్దౌస్, షార్మిన్ అక్టర్ సుప్తా, సర్మిన్ సుల్తానా, శోభనా మోస్తరీ, షోర్నా అక్టర్, రీతూ మోని, ఫాహిమా ఖాతున్, రాబెయా ఖాన్, మరుఫా అక్టర్, సుల్తానా ఖాతున్, షంజీదా అక్టర్ మగ్లా.

శ్రీలంక: చమరి అతపత్తు (కెప్టెన్), మిథాలి అయోధ్య, కవిషా దిల్హారి, ఇమేషా దులాని, విష్మి గుణరత్నే, కావ్య కావింది, సంజన కావింది, సుగంధిక కుమారి, నిమాషా మీపేగే, కౌషిని నుత్యంగన, హాసిని పెరీరా, చాముడి ప్రబోధ, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, చేతన విముక్తి.

హాంగ్‌కాంగ్: నటాషా మైల్స్ (కెప్టెన్), మరియం బీబీ, చాన్ కా యింగ్, చాన్ సా హా, డోరోథియా చాన్, ఇక్రా సహర్, జోయ్లీన్ కౌర్, మహెక్దీప్ కౌర్, మారిస్కో హిల్, మెరీనా లాంప్లో, రుచిత వెంకటేష్, షాంజీన్ షహజాద్, సియు మే వై, వాంగ్ వింగ్ కియు హేలీ, యాస్మిన్ దాస్వానీ.

థాయిలాండ్: నరుఎమోల్ చాయ్‌వాయ్ (కెప్టెన్), నన్నపత్ కొంచారోయెంకాయ్, నత్థకాన్ చంథమ్, చనిదా సుత్తిరువాంగ్, సులీపోర్న్ లాఓమి, ఒన్నిచా కాంచోంఫు, తిపాట్చా పుత్తవాంగ్, ఫన్నితా మాయా, అఫిసరా సువాంచోన్రాతి, సునిదా చతురోంగరత్తనా, చయనిసా ఫెంగ్పేన్, నన్నఫత్ చైహన్, కొరనిత్ సువాంచోన్రాతి, థనరాడ సీసవాన్, నయోమి హామిల్టన్.

ఇండోనేషియా: నందా సకారిణి (కెప్టెన్), కాదెక్ విందా ప్రాస్తిని, రహ్మావతి పాంగుస్తుతి, వేసికా రత్న దేవి, రాదా రాణి, దేసి వులాందారి, పుత్రి సువందివి, కిసి సాలిసా కాస్సే, సాంగ్ మేప్రియాని, ని కాదెక్ అరియాని, డెర్ని బాంగి, దారా అగుంగ్ లక్ష్మి, లీ కియావో, మరియా కొరాజోన్ వోంబాకి, సోఫియా వెలిక్.

యూఏఈ: ఈషా ఓజా (కెప్టెన్), అర్చరా సుప్రియా, హీనా హోట్‌చందాని, ఇందుజ నందకుమార్, జనని తిరుక్కుమారన్, లావణ్య కెన్యా, మెహుల్ కులకర్ణి, రిణిత రజిత్, సమైరా ధరనిధర్క, సియా గోఖలే, శశికళ డి సిల్వా, సురక్ష కొట్టే, తీర్థ సతీష్, ఉత్తర అయ్యర్, వైష్ణవి మహేష్.