ఇప్పటివరకు విలన్, కామెడీ, మాస్ సినిమాలు చేసిన విశ్వక్ సేన్.. ఈసారి జానర్ మార్చాడు. ప్రస్తుతం పొలిటికల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. 'లెగసీ' టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి సాయికిరణ్ దైదా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. గురువారం చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో చివరి షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. విశ్వక్ ప్రధాన తారాగణంపై కథకు కీలకమైన సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్స్, పాటలను చిత్రీకరించనున్నారు.
నెలరోజులపాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. అధికారాన్ని వారసత్వంగా పొందిన ఓ యువకుడు.. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాడా లేక తిరగరాస్తాడా అనే ప్రశ్న చుట్టూ జరిగే కథ ఇది ఏక్తా రాథోడ్ హీరోయిన్ గా నటిస్తు స్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు కేజే మీనన్ విలన్ గా కనిపించబోతున్నాడు. మురళీ మోహన్, రావు రమేష్ సచిన్ వేడేకర్, బుషీ రవి, కల్యాణి నటరాజన్, రాజీవ్ కనకాల, రవి కాలే కీలక పాత్రలు పోషిస్తున్నారు. యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి వైరా నిర్మిస్తున్నారు. సంజయ్ సాంబ్రాణి, వి.వి.ఎన్ ప్రసాద్ సహ నిర్మాతలు. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు
