ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం..కొత్త పించన్ల కు ఆగస్టు 31 వరకు దరఖాస్తులు

ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం..కొత్త పించన్ల కు ఆగస్టు 31 వరకు దరఖాస్తులు
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కూసుమంచి, వెలుగు: విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డలో పంచాయతీ భవన నిర్మాణం, గోపాలపురంలో అదనపు తరగతి గదుల నిర్మాణాలకు కలెక్టర్​ దివాకర టీఎస్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌(ఏటీసీ)లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏటీసీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొత్త పించన్ల మంజూరు కోసం ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మంత్రి తెలిపారు. ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఆర్‌‌అండ్‌బీ ఎస్ఈ యుగంధర్ రావు, హౌజింగ్ పీడీ శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో ఎన్.శ్రీనివాస్, ఎంపీడీవో సిలార్ సాహెబ్, తహసీల్దార్లు విల్సన్, డి.సైదులు, తదితరులు పాల్గొన్నారు.