త్వరలోనే అన్ని జూనియర్ కాలేజీల్లో ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..పకడ్బందీ అమలుకు సీజీజీకి నిర్వహణ బాధ్యతలు

త్వరలోనే అన్ని జూనియర్ కాలేజీల్లో ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..పకడ్బందీ అమలుకు సీజీజీకి నిర్వహణ బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని సర్కారు జూనియర్ కాలేజీల్లో రాబోయే రోజుల్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు ఇంటర్​విద్యాశాఖ స్పష్టం చేసింది. కాలేజీల్లోని లెక్చరర్లు, సిబ్బందితో పాటు విద్యార్థులందరికీ ఎఫ్ఆర్ఎస్ విధానం ఉంటుందని చెప్పింది. గురువారం ‘వీ6 వెలుగు’లో ‘ఇంటర్​లో అటకెక్కిన ఫేషియల్ అటెండెన్స్’ హెడ్డింగ్ తో వార్త ప్రచురితమైంది. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు అయినా.. ఇంకా కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్ అమలు కావడం లేదని ప్రస్తావించింది. 

దీనిపై ఇంటర్​ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ స్పందించింది. గత విద్యాసంవత్సరం నుంచే జూనియర్ కాలేజీల్లో ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ కొనసాగుతోందని వెల్లడించింది. వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, అదనపు ఫీచర్లు జోడించేందుకు ఎండ్ టూ -ఎండ్ ఎఫ్ఆర్ఎస్ సొల్యూషన్ బాధ్యతను ‘సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ కి అప్పగించినట్లు తెలిపింది. సీజీజీ ఆధ్వర్యంలో రూపొందించిన ఎఫ్ఆర్ఎస్ టెక్నాలజీని 5 సర్కారు కాలేజీల్లో పైలట్ ప్రాజెక్ట్‌‌‌‌గా రన్ చేసి పరీక్షించామని, రిజల్ట్ బాగా వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం కాలేజీల ప్రిన్సిపాల్స్, జూనియర్ లెక్చరర్లు, అడ్మినిస్ట్రేటర్లకు ట్రైనింగ్ ఇస్తామని వివరించింది..