హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా గురువారం మూడు జోన్ల పరిధిలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
54 అక్రమ నిర్మాణాలను గుర్తించి, వాటిలో 21 భవనాలను కూల్చివేశారు. మరో 14 నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు. మరో నిర్మాణాన్ని సీజ్ చేశారు. మిగతా వాటిని కూడా నిబంధనల ప్రకారం కూల్చివేస్తామని తెలిపారు. అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
