ఏమీ మిగల్లే..నేపాల్ జలప్రళయంపై ప్రత్యక్ష సాక్షులు

ఏమీ మిగల్లే..నేపాల్ జలప్రళయంపై ప్రత్యక్ష సాక్షులు

ఖాట్మండు: నేపాల్‌‌ను  కుదిపేసిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని నింపాయి. సరిహద్దు ప్రాంతమైన రసువా జిల్లాలోని తిమురే పట్టణంపై జలప్రవాహం విరుచుకుపడింది. వరద వేగం, ఆ టైంలో వచ్చిన సౌండ్స్ అచ్చం భూకంపం వచ్చినట్లే అనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

తిమురే పూర్తిగా సర్వనాశనం అయిపోయిందని.. ఇక అక్కడ ఏమీ మిగల్లేదని బుధవారం నాటి భయానక దృశ్యాలను గుర్తుచేసుకున్నారు. ఉదయం బ్రేక్‌‌ఫాస్ట్ తింటుండగా ఒక్కసారిగా వరద ముంచెత్తిందని బాధితులు తెలిపారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఊహించని విపత్తు.. కళ్ల ముందే అంతా నాశనమైందని, కండ్ల ముందే భవనాలు, మనుషులు, మూగజీవాలు భారీ బురద ప్రవాహంలో కొట్టుకుపోయాయని కంటతడి పెట్టుకుంటూ వివరించారు.