- పార్టీ నియమావళి ప్రకారమే క్రమశిక్షణ చర్యలు : టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
నిజామాబాద్, వెలుగు : బీసీ నేతలను కాంగ్రెస్ టార్గెట్చేస్తుందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్అన్నారు. రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ఒక్కటేనన్నారు.
గురువారం నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తమకు ఎవరిపైనా కోపతాపాలు, కక్షలు లేవని, పార్టీ నియమావళిని గౌరవిస్తూ అందరూ క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ పూర్తిగా స్టడీ చేసి ఇచ్చిన రిపోర్టును రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షీ నటరాజన్ ద్వారా ఏఐసీసీకి పంపామన్నారు.
ఏఐసీసీ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది తాను చెప్పలేనని, కానీ నిర్ణయం ఎలా ఉన్నా అందరూ ఆమోదించవలసిందేని చెప్పారు. కొండా సుస్మిత వివాదాస్పద కామెంట్స్తర్వాత కొండా మురళి తనను కలవలేదని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసినట్టు మీడియా ద్వారానే తెలిసిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్అధికారంలోకి రాగానే కులగణన చేపట్టి బీసీ లెక్కలు తేల్చామని, రిపోర్టను కేంద్రానికి పంపితే ఏ నిర్ణయం తీసుకోకుండా తొక్కిపెట్టారని విమర్శించారు.
నీటి వాటాల గురించి అర్థం పర్థం లేని అపోహలు సృష్టించడానికి హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరితోనూ రాజీపడబోమన్నారు. ఆయన వెంట డీసీసీ ప్రెసిడెంట్నగేశ్రెడ్డి ఉన్నారు. అంతకు ముందు తల్లి చనిపోయి బాధలో ఉన్న మేయర్ఉమారాణిని పరామర్శించారు. సర్ లో భాగంగా అందిన నోటీసుకు సమాధానం ఇచ్చినట్లు చెప్పారు.
