కొడిమ్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని రైస్ మిల్లులపై విజిలెన్స్ ఎన్ ఫోర్సెమెంట్ ఆఫీసర్లు దాడులు చేశారు. మూడు రోజులుగా మిల్లులను తనిఖీ చేసిన అధికారులు.. మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలోని అమృత ఆగ్రో ఇండస్ట్రీ, హరిహర ఆగ్రో ఇండస్ట్రీల్లో 7,216 టన్నుల బియ్యాన్ని మాయమైనట్లు గుర్తించారు.
ఈ బియ్యం విలువ రూ.20 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. రెండు మిల్లులకు చెందిన ఎనిమిది మందిపైన క్రిమినల్ కేసులు నమోదు చేశారు. గంగాధర్, గోదావరి, వజ్రమ్మ, మారుతిని గురువారం అరెస్ట్ చేయగా.. మిలిగిన నలుగురు పరారీలో ఉన్నారని సీఐ రాజ్ కుమార్, ఎస్సైనరేష్ కుమార్ తెలిపారు.
