రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారుతున్నారు. ఇటీవల హసిత్ గోలి దర్శ కత్వంలో ఓ సినిమాను ప్రకటించిన రవితేజ.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. 'సరిపోదా శనివారం'తో సక్సెస్ అందుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి ఓ కొత్త సినిమాను చేయబోతున్నారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై లక్ష్మణ్, శ్రీని ఈ చిత్రాన్ని నిర్మించను న్నారు. రవితేజ ఎనర్జీ. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్. లార్జర్ దేన్ లైఫ్ ఇమేజ్కు తగ్గట్టుగా వివేక్ ఆత్రేయ తనదైన శైలిలో కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
దీంతో ఈ కాంబినేషన్ పై ఇప్పటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రవితేజ నటించిన 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లోంది. విడుదలై వారం రోజులు గడిచినా భారీ వసూళ్లతో సత్తా చాటుతున్న నేపథ్యంలో రవితేజ నుంచి వరుసగా రాబో తున్న కొత్త ప్రాజెక్టులపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.
హసిత్ గోలి దర్శక త్వంలో తెరకెక్కనున్న సినిమా పూర్తయిన తర్వాత వివేక్ ఆత్రేయతో రవితేజ చేయనున్న చిత్రం సెట్స్పైకి వెళ్లనుంది. ఈ సినిమాకుసం బంధించిన ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు..
