రాగ్ మయూర్ హీరోగా 'డిజే టిల్లు' ఫేమ్ విమల్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం 'అనుమాన పక్షి', మెరీన్ హీరోయిన్ నటించగా, రాశి, ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్ కీలకపాత్రలు పోషించారు. రాజీవ్ చిలకా, రాజేష్ జగతియాని, హిరాచంద్ దండ్ నిర్మించారు.
ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్తో ఇంప్రెస్ చేసిన మేకర్స్.. శుక్రవారం మూవీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 18న థియేటర్స్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
'డీజే టిల్లు' క్యారెక్టరైజేషన్ తో నవ్వులు పంచిన దర్శకుడు విమల్ కృష్ణ- ప్రతి విషయానికి అనుమానపడే హీరో క్యారెక్టరైజేషన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు.
