భక్తి, మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మహేంద్రగిరి వారాహి..

భక్తి, మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మహేంద్రగిరి వారాహి..

సుమంత్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో సంతోష్ జా గర్లపూడి తెరకెక్కించిన స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ 'మహేంద్రగిరి వారాహి', కలిపు మధు, లక్ష్మణ్ నిర్మిస్తు న్నారు. సెప్టెంబర్ 11న సినిమా విడుదల కాబోతోంది. శుక్రవారం ట్రైలర్ను రిలీజ్ చేశారు. భక్తి, విశ్వాసం, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో వచ్చిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. 

సుమంత్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకోగా, ఐశ్వర్య రాజేష్ వారాహి మాత పాత్రలో కనిపించింది. సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్రలో సర్ప్రైజ్ ఇచ్చాడు. మీనాక్షి గోస్వామి. మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల, అలీ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్కు అతిథిగా హాజరైన దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ 'ప్రతి డివైన్ సినిమా మన కల్చర్ ని చెబుతుంది. ఈ ట్రైలరచూస్తుంటే కచ్చితంగా విజయం సా ధీస్తుందని నమ్ముతున్నా' అని అన్నాడు. సుమంత్ మాట్లాడు. తూ 'సంతోష్ నాకిది రెండో సినిమా. టీజర్, ట్రైలర్తో అంచనాలు పెరిగాయి. 

ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది' అని అన్నాడు. ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని డైరెక్ట ర్ సంతోష్ చెప్పాడు. వారాహి అమ్మవారి ఆశీస్సులతో ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని నిర్మాత మధు అన్నారు. నటి మీనాక్షి గోస్వామి, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్్సపాల్గొన్నారు.