బంగారం, వెండి ధరలు ఈవారం చివరికి చేరుకునేటప్పటికీ భారీగా దిగొస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థపై కొనసాగుతున్న నీలినీడల మధ్య ఊహించని ర్యాలీ చూసిన గోల్డ్ అండ్ సిల్వర్ బులియన్ మార్కెట్ల కరెక్షన్ దెబ్బకు మళ్లీ దిగొస్తున్నాయి. ఈ క్రమంలో శ్రావణమాసంలో షాపింగ్ చేయాలని అనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ భారీ పతనాన్ని వినియోగించుకుని షాపింగ్ చేసుకోవటం మంచిది. ఇందుకోసం ముందుగా మీ నగరాల్లోని రిటైల్ విక్రయ రేట్లను పరిశీలించటం మంచిది.
ఆగస్టు 29న బంగారం రేట్లు భారీగా తగ్గాయి. ఆగస్టు 28 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.289 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 824గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 505గా కొనసాగుతోంది.
శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 29, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీ రూ.2లక్షల 60వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.260 దగ్గర ఉంది.
