భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పీఏపై కేసు.. ఉద్యోగం కోసం రూ. పది లక్షలు తీసుకొని...

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పీఏపై కేసు.. ఉద్యోగం కోసం రూ. పది లక్షలు తీసుకొని...

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పీఏ కళ్యాణ్ కుమార్ పై కేసు నమోదయ్యింది. మణుగూరులో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.10 లక్షలు తీసుకొని మోసం చేశాడని శనివారం ( ఆగస్టు 29 ) పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు రాయల శ్రీను. కళ్యాణ్ కుమార్ ఇచ్చిన అప్పోయింట్మెంట్ ఆర్డర్ నకిలీదిగా తేలడంతో అనుమానం వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు బాధితుడు. ఈ విషయంపై కళ్యాణ్ కుమార్ ను నిలదీయగా అజ్ఞాతంలోకి వెళ్లాడని తెలిపాడు.

మణుగూరులో కల్యాణ్‌కుమార్‌ ఆస్తుల వివరాలపై ఆరా తీస్తున్నారు బాధితులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల పేరుతో 10 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పీఏ కల్యాణ్ ను సరెండర్ చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.

ఉద్యోగాల పేరు తో నిరుద్యోగులను మోసం చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు కల్యాణ్ పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని తెలిపారు పోలీసులు. ప్రభుత్వ ఉద్యోగాలు డబ్బులు పోసి కొంటే రావని... కస్టపడి చదివితేనే వస్తాయని.. ఎవరైనా డబ్బులిస్తే ఉద్యోగాలిప్పిస్తామంటే నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు.