కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) సైంటిఫిక్/ టెక్నికల్ అసిస్టెంట్ - ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలోని ఈ పోస్టులను గ్రూప్ - బి ఎస్ అండ్ టీ (నాన్--గెజిటెడ్) కేటగిరీ కింద భర్తీ చేయనున్నారు. అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 1న ప్రారంభమై సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది.
పోస్టు పేరు: సైంటిఫిక్/ టెక్నికల్ అసిస్టెంట్–ఏ.
మొత్తం ఖాళీలు: 376.
విభాగాల వారీగా ఖాళీలు
కంప్యూటర్ సైన్సెస్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 300: (అన్రిజర్వ్డ్ – 122, ఎస్సీ – 45, ఎస్టీ–22, ఓబీసీ–81, ఈడబ్ల్యూఎస్–30).
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 26: (అన్రిజర్వ్డ్ –13, ఎస్సీ -–3, ఎస్టీ-–1, ఓబీసీ-–7, ఈడబ్ల్యూఎస్–2).
డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 50: (అన్రిజర్వ్డ్–22, ఎస్సీ–7, ఎస్టీ–3, ఓబీసీ–13, ఈడబ్ల్యూఎస్-–5).
విద్యార్హతలు
కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్సెస్, కంప్యూటర్ అండ్ నెట్‌వర్కింగ్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేటిక్స్లో ఎంఎస్సీ/ ఎంఎస్/ ఎంసీఏ/ బీఈ/బి.టెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్థులు పేపర్ కోడ్ 'సీఎస్' లో వ్యాలిడ్ గేట్ స్కోర్‌ను కలిగి ఉండాలి.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: ఈ విభాగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పేపర్ కోడ్ 'ఈసీ'లో వ్యాలిడ్ గేట్ స్కోర్‌ను కలిగి ఉండాలి. ఈ విభాగానికి సంబంధించి నోటిఫికేషన్‌లో ప్రత్యేకంగా డిగ్రీ అర్హత వివరాలను పేర్కొనలేదు. కేవలం గేట్ స్కోర్‌ను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటారు.
డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఈ విభాగానికి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా పేపర్ కోడ్ 'డీఏ'లో వ్యాలిడ్ గేట్ స్కోర్‌ను కలిగి ఉండాలి. ఈ విభాగం కింద నోటిఫికేషన్‌లో ప్రత్యేకంగా డిగ్రీ అర్హత వివరాలను పేర్కొనలేదు. కేవలం గేట్ స్కోర్‌ను మాత్రమే ప్రామాణికంగా పరిగణిస్తారు.
వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 1.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు. అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.800 చెల్లించాలి.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
గేట్ –2024, గేట్– 2025, గేట్–2026 స్కోర్లకు సమాన వెయిటేజీ ఇస్తారు. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసిన విభాగానికి అర్హత ఉన్న ఏదైనా ఒక సంవత్సరానికి సంబంధించి తమ ఉత్తమ గేట్ స్కోర్‌ను సమర్పించాలి.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ recruitment.nic.inను సందర్శించండి.
