ప్రత్యేక హోదా (Special Status), స్పెషల్ కేటగిరీ హోదా (Special Category Status) రెండూ ఒకటే అని చాలామంది భావిస్తుంటారు. కానీ రాజ్యాంగబద్ధంగా, ఆర్థికపరంగా ఈ రెండింటి మధ్య కీలకమైన వ్యత్యాసాలు ఉన్నాయి. అసలు ఈ రెండు హోదాల మధ్య ఉన్న ప్రధాన తేడాలేంటో, వాటికి లభించే అధికారాలు మరియు నిధుల వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.....
అసలు ఈ రెండింటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా అనేది రాజ్యాంగం ద్వారా పార్లమెంట్ 2/3వ వంతు మెజార్టీతో చట్టం చేసి కల్పించే హోదా. దీని ద్వారా ప్రత్యేక హోదా కల్పించిన ప్రాంతాలకు చట్టబద్దమైన అధికారాలు, రాజకీయ అధికారాలు కల్పిస్తారు.
స్పెషల్ కేటగిరి రాష్ట్రాలకు ఆ హోదా కల్పించే సందర్భంలో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. ఈ హోదా కల్పించిన రాష్ట్రాలకు ఆర్థికపరమైన, అభివృద్ధిపరమైన, పరిపాలనాపరమైన అధికారాలు కల్పిస్తారు.
1969లో ఐదో ఫైనాన్స్ కమిషన్ సిఫారసులను అనుసరించి వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక సహాయాన్ని అందించాలని సూచించింది. ఈ విధమైన రాష్ట్రాలకు ప్రత్యేక సహకారాన్ని అందించడం ద్వారా కేంద్రం కల్పించే నిధుల్లో 90 శాతం సబ్సిడీ ఇవ్వడంతోపాటు పన్ను మినహాయింపులు కల్పిస్తారు. ప్రస్తుతం మన దేశంలో 11 రాష్ట్రాలకు ఈ హోదా కల్పించారు. 14వ ఫైనాన్స్ కమిషన్ కొత్తగా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించడాన్ని వ్యతిరేకించింది.
