- 3 ప్రతిపాదనలు చేసిన నోయెల్ టాటా నేతృత్వంలోని టాటా ట్రస్ట్స్
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ కంపెనీల హోల్డింగ్ సంస్థ టాటా సన్స్‌లో తన వాటాలను పెంచుకోవాలని టాటా ట్రస్ట్‌లు చూస్తున్నాయి. వీటి వద్ద 66 శాతం వాటా ఉండగా, 18.4 శాతం వాటా అతిపెద్ద మైనారిటీ వాటాదారైన షాపూర్‌జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్ చేతిలో ఉంది. ఎస్‌పీ గ్రూప్ అప్పులతో సతమతవుతుండడంతో టాటా ట్రస్ట్ చైర్మన్ నోయెల్ టాటా నేతృత్వంలోని టాటా సన్స్ టీమ్ మూడు పరిష్కార మార్గాలను సూచించింది.
టాటా సన్స్‌లో ఎస్పీ గ్రూప్‌కు ఉన్న 18.4శాతం వాటాకు బదులుగా టాటా పవర్ వంటి లిస్టెడ్ టాటా కంపెనీల షేర్లను కేటాయించడం. లేదా విదేశీ బ్యాంకుల నిధులతో ఎస్పీ గ్రూప్ వాటాను టాటా సన్స్ నేరుగా కొనుగోలు చేయడం. మూడోది అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఈ వాటాను విక్రయించడం. ఈ ఒప్పందం జరిగితే టాటా సన్స్‌ను లిస్టింగ్ చేయాల్సిన అవసరం ఉండదు.
