కోటపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అలుగామకు చెందిన నిరుపేద కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి పార్టీ నాయకులు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. అలుగామకు చెందిన నిరుపేద కాంగ్రెస్ నేత దుర్గం శ్రీనివాస్ వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు స్పందించారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు శుక్రవారం సీనియర్ నాయకులు దుర్గం వెంకటస్వామి, మండల ఉపాధ్యక్షుడు ఎంబరి సజన్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.20 వేలు అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కోటపల్లి మండల కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దుర్గం బ్రహ్మయ్య, సెక్రటరీ పల్లె సత్తయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
