జైనూర్: గర్భిణులు, బాలింతలకు కాయగూరల విత్తనాలు

జైనూర్: గర్భిణులు, బాలింతలకు కాయగూరల విత్తనాలు

జైనూర్, వెలుగు: పోషకాహారం, సేంద్రియ సాగుపై సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ(సీడబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం ఆసిఫాబాద్​జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని కోహినూర్ (కె), సోయంగూడ గ్రామాల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు 12 రకాల కాయగూరలు, ఆకుకూరల విత్తనాలు పంపిణీ చేశారు. 

ఇంటి పెరట్లో సేంద్రియ పద్ధతిలో కాయగూరలు, ఆకుకూరలు సాగు చేసుకుని పోషకాహారం తీసుకోవాలని సీడబ్ల్యూఎస్ బృందం సూచించింది. ఇంటి తోటలను అభివృద్ధి చేసుకోవాలని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆ సంస్థ రాష్ట్ర బృంద సభ్యులు సుస్మిత, వైశాలి, కమ్యూనిటీ మొబిలైజర్లు హన్వతే దిగంబర్, జీవనే కైలాష్, ఎఫ్ఈ డబ్ల్యూలు మర్సుకోల జగ్జీవన్, దుర్వ నాగోరావు, వాలంటీర్, మాజీ సర్పంచ్ హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.