కరీంనగర్ జిల్లాలో కన్నుల పండువగా మార్కండేయుడి శోభాయాత్ర

కరీంనగర్ జిల్లాలో కన్నుల పండువగా మార్కండేయుడి శోభాయాత్ర

గంగాధర, రామడుగు, కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్​జిల్లాలో మార్కండేయుడి శోభాయాత్రను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గంగాధర మండలం గట్టుభూత్కూర్, గంగాధర, బూరుగుపల్లి, కురిక్యాల, గర్శకుర్తి, వెంకటాయపల్లి, లక్ష్మీదేవిపల్లి, మధురానగర్, రామడుగు మండల కేంద్రం, గోపాల్​రావుపేట, రాంచంద్రాపూర్, షానగర్, వెదిర, దేశరాజ్​పల్లి, మోతె, లక్ష్మీపూర్, వెలిచాల, కొత్తపల్లి మండలం ఎలగందల్, బావుపేట, పద్మనగర్, కొత్తపల్లిలో వేడుకలు నిర్వహించారు. 

మార్కండేయుడి ఫొటోను శావలో పెట్టి,  మగ్గం, రాట్నాన్ని ట్రాక్టర్​పై ఏర్పాటుచేసి నేతన్నలు వస్త్రం నేస్తూ గ్రామంలోని వీధివీధినా తిప్పారు. మహిళలు మంగళహారతులు పట్టి శోభయాత్రకు స్వాగతం పలికారు. అనంతరం రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, పద్మశాలీలు పాల్గొన్నారు.