బుడాపెస్ట్: ఇండియా స్క్వాష్ ప్లేయర్ వేలావన్ సెంథిల్‌కుమార్.. పీఎస్‌ఏ కాపర్ ఈవెంట్ అయిన బుడాపెస్ ఓపెన్‌లో ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన సెమీస్‌లో ఎనిమిదో సీడ్ సెంథిల్‌కుమార్ 9–11, 11–8, 11–7, 11–1, 12–10తో మూడోసీడ్ వీర్ చోత్రానీ (ఇండియా)పై విజయం సాధించాడు. సెంథిల్ కెరీర్‌లో ఇది 15వ పీఎస్‌ఏ టూర్ ఫైనల్ కావడం విశేషం. టైటిల్ ఫైట్‌లో సెంథిల్‌కుమార్.. బాలాజ్ ఫర్కాస్ (హంగేరి) తో తలపడనున్నాడు. ఈ టూర్ చరిత్రలో ఇద్దరి మధ్య ఇది మూడో మ్యాచ్ కాగా, గతేడాది జరిగిన పోరులో సెంథిల్‌కుమార్ విజయం సాధించాడు.
