టీమిండియా మానసిక స్థైర్యం గొప్పది: గంభీర్‌‌

 టీమిండియా మానసిక స్థైర్యం గొప్పది: గంభీర్‌‌

కొలంబో: శ్రీలంకతో రెండు టెస్ట్‌‌ల సిరీస్‌‌లో చివరి వరకు పోరాడిన టీమిండియా మానసిక స్థైర్యం చాలా గొప్పదని హెడ్‌‌ కోచ్‌‌ గౌతమ్‌‌ గంభీర్‌‌ ప్రశంసించాడు. టెస్ట్‌‌లకు కావాల్సిన అన్ని అంశాలు కుర్రాళ్లలో ఉన్నాయన్నాడు. ‘టెస్ట్‌‌ క్రికెట్‌‌కు కావాల్సిన వ్యక్తిత్వం, సహనం, మానసిక దృఢత్వాన్ని మన కుర్రాళ్లు ప్రదర్శించారు. ప్రతి మ్యాచ్‌‌లోనూ గొప్పగా ఆడారు, పోరాడారు. ప్రతి ఆటగాడు వ్యక్తిగతంగా అద్భుతమైన ప్రదర్శన చూపెట్టారు’ అని గౌతీ ఎక్స్‌‌లో రాసుకొచ్చాడు. రెండో టెస్ట్‌‌లో లంక బ్యాటర్‌‌ సోనల్‌‌ దినుషా చూపిన అసమాన పోరాటాన్ని గంభీర్‌‌ మెచ్చుకున్నాడు.