ఇవాళ్టి నుంచి(ఆగస్టు 29) ఎడ్‌‌సెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్

ఇవాళ్టి నుంచి(ఆగస్టు 29) ఎడ్‌‌సెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు: బీఈడీ అడ్మిషన్లకు ఎడ్‌‌సెట్ రెండో విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఫస్ట్ ఫేజ్‌‌‌‌‌‌‌‌లో రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులు శనివారం నుంచి సెప్టెంబర్ 3 వరకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌తోపాటు సర్టిఫికెట్లు అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకోవచ్చని అడ్మిషన్ల కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. 

వచ్చే నెల 6 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్లు,  12న సీట్ల అలాట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఉంటుందని చెప్పారు. సీట్లు పొందినవారు  వచ్చే నెల 15 నుంచి 19 లోపు కాలేజీల్లో రిపోర్ట్‌‌ చేయాలన్నారు.