సోనియా ఆత్మకథ ‘బిలాంగింగ్’ను మేం పబ్లిష్ చేయట్లే: పెంగ్విన్‌‌‌‌‌‌‌‌ ఇండియా

సోనియా ఆత్మకథ ‘బిలాంగింగ్’ను మేం పబ్లిష్ చేయట్లే: పెంగ్విన్‌‌‌‌‌‌‌‌ ఇండియా

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నేత సోనియా గాంధీ రాసిన ‘బిలాంగింగ్‌‌‌‌‌‌‌‌: ఏ జర్నీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ లవ్‌‌‌‌‌‌‌‌’ బుక్‎ను భారత్‌‌‌‌‌‌‌‌లో తాము ప్రచురించడం లేదని పెంగ్విన్‌‌‌‌‌‌‌‌ రాండమ్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌ ఇండియా సంస్థ స్పష్టం చేసింది. అయితే ఈ పుస్తకాన్ని ప్రచురించేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని వెల్లడించింది. ఎడిటోరియల్‌‌‌‌‌‌‌‌ మార్పులకు సోనియా గాంధీ అంగీకరించలేదనే కారణంతో ఈ పుస్తకాన్ని ప్రచురించకూడదని పెంగ్విన్‌‌‌‌‌‌‌‌ నిర్ణయించిందన్న ప్రచారంలో నిజం లేదని తెలిపింది. భారత్‌‌‌‌‌‌‌‌లో ‘బిలాంగింగ్‌‌‌‌‌‌‌‌’ పుస్తకానికి తాము ప్రచురణకర్త కాదని స్పష్టం చేసింది.

‘‘ప్రచురణకర్తగా పుస్తకంలోని అంశాల్లో వాస్తవాలను నిర్ధారించుకోవడం, పుస్తకానికి ప్రయోజనం కలిగించే సూచనలను రచయితలకు అందించడం మా హక్కు, బాధ్యత. ఇది సాధారణ ప్రచురణ ప్రక్రియలో భాగమే’’ అని సంస్థ తెలిపింది. పుస్తక ప్రచురణ కోసం సోనియా గాంధీతో జరిగిన చర్చల నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తున్నది. అయితే సోనియా గాంధీతో జరిగిన చర్చల వివరాలను వెల్లడించేందుకు ఆ సంస్థ నిరాకరించింది. ఈ పుస్తకం ప్రచురణ నుంచి పెంగ్విన్‌‌‌‌‌‌‌‌ తప్పుకోవడంతో ‘హార్పర్‌‌‌‌‌‌‌‌ కొల్లిన్స్‌‌‌‌‌‌‌‌’ ఈ పుస్తకాన్ని భారత్‌‌‌‌‌‌‌‌లో ప్రచురించి, పంపిణీ చేసేందుకు ఒప్పందం 
చేసుకున్నదని తెలుస్తున్నది.