నిజామాబాద్, వెలుగు: బాల్కొండ మండలంలో గంజాయి తాగుతూ పట్టుబడ్డ 31 మంది యువకులను పోలీసులు డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. బాల్గొండ మండల కేంద్రంలోని వన్నెల్(బి) కెనాల్‌కట్టపై కొందరు గాంజా తాగుతున్నారనే సమాచారంతో ఎస్‌ఐ శైలేందర్ అక్కడికి చేరుకొని 18 మందిని అదుపులోకి తీసుకున్నారు.
గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. మల్లన్నగుట్టపై కూడా గాంజా తాగుతున్నారన్న సమాచారంతో అక్కడికి చేరుకొని మరో 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 31 మందిని జిల్లా కేంద్రంలోని డీఅడిక్షన్‌కు సెంటర్‌కు తరలించారు.
