నన్నే లైట్ తీసుకుంటారా.. ఇది నా స్టామినా! దులీప్ ట్రోఫీలో దుమ్ము రేపుతున్న షమీ

నన్నే లైట్ తీసుకుంటారా.. ఇది నా స్టామినా! దులీప్ ట్రోఫీలో దుమ్ము రేపుతున్న షమీ

ఇండియా క్రికెట్ లో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ.. ఆటగాళ్లను ఎందుకు పక్కన పెడతారో ఒప్పటికీ అర్థంకాని ప్రశ్నే. ఫామ్ లో ఉన్నప్పటికీ.. ప్రూవ్ చేసుకుంటున్నప్పటికీ.. నెగ్లెక్ట్ చేయాలనుకుంటే ఎంత మొత్తుకున్నా.. ఫ్యాన్స్ నుంచి ఎంత డిమాండ్ వచ్చినా లైట్ తీసుకుంటారు. అలా బలైన ఆటగాళ్లలో షమీ ఒకరు. టీమిండియా సెలెక్టర్లు, కోచ్ లు పక్కన పెట్టినప్పటికీ.. తన టాలెంట్ ఏంటో, సత్తా ఏంటో చాటుతున్నాడు. 

ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఆడుతున్న మహమ్మద్ షమీ.. తన పేస్ బౌలింగ్ తో దుమ్ము దులుపుతున్నాడు. బెంగళూరులో జరుగుతున్న సెమీఫైనల్ 1,  డే3 మ్యాచ్ లో.. ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న షమీ తన అద్భుతమైన పేస్ తో సెంట్రల్ జోన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. దీంతో సెంట్రల్ జోన్ 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. 

ఈస్ట్ జోన్ తరఫున షమీ కీలకమైన రెండు వికెట్లు పడగొట్టడంతో సెంట్రల్ జోన్ పతన ప్రారంభమైంది. ఆ తర్వాత మరో పేసర్ ముకేష్ కుమార్ నాలుగు వికెట్లు తీసుకోవడంతో మ్యాచ్ పై పట్టు సాధించారు. 

ALSO READ : US ఓపెన్లో వైరల్ మూమెంట్.. 

ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంట్రల్ జోన్ 266 రన్స్ చేసింది. లోయర్ ఆర్డర్స్ సపోర్ట్ తో రింకూ సింగ్ 60 రన్స్ తో పోరాటం చేసి స్కోర్ లో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈస్ట్ జోన్ నుంచి చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ 81 బంతులలో 92 రన్స్ తో చెలరేగగా.. మరో ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్ 69 రన్స్ ఇద్దరూ కలిసి 161 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఈస్ట్ జోన్ కూడా 266 రన్స్ చేయగలిగింది.  సెంట్రల్ జోన్ నుంచి 4 వికెట్లు తీసుకుని హర్ష్​ దుబే ఒక్కడే కొంత ప్రభావం చూపించాడు. 

ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో షమీ, ముకేష్ కుమార్ దెబ్బకు 158 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. దీంతో ఈస్ట్ జోన్ విజయం ఖాయం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.