రాయదుర్గం పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి చనిపోయాడు. అతను బీహార్ రాష్ట్రానికి చెందిన నందులాల్ గా గుర్తించారు పోలీసులు. ఈ యాక్సిడెంట్ చేసిన ఎవరో తెలుసా ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్.. అవును.. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డు రోటరీ టూ ఖాజాగూడ మెయిన్ రోడ్డులో ఈ యాక్సిడెంట్ జరిగినట్లు చెబుతున్నారు పోలీసులు. వేగంగా వచ్చిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ కారు.. రోడ్డు దాటుతున్న నందులాల్ ను ఢీకొట్టింది. రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న నందులాల్ ను.. తన కారులో ఆస్పత్రికి తరలిస్తుండగా మరో యాక్సిడెంట్ జరిగింది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ కారును.. మరో కారు ఢీకొట్టింది. ఈ క్రమంలోనే సందీప్ కారులో ఉన్న గాయపడిన నందులాల్ చనిపోయాడు. సందీప్ కారును ఢీకొట్టిన తర్వాత.. ఆ కారు స్పాట్ నుంచి ఆగకుండా వెళ్లిపోయింది.
ఈ యాక్సిడెంట్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. సీసీ కెమెరా పరిశీలించిన తర్వాత.. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితోపాటు యాక్సిడెంట్ చేసిన అతని కారును.. ఆ తర్వాత సందీప్ కారును ఢీకొట్టిన మహీంద్రా కారును గుర్తించారు పోలీసులు. ఈ రెండు వాహనాలతోపాటు సందీప్ ను అరెస్ట్ చేశారు రాయదుర్గం పోలీసులు.
