రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలోని నవరత్న కంపెనీ అయిన కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీఓఎన్సీఓఆర్) వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎంటీ), అసిస్టెంట్ ఆఫీసర్ (ఏఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టు పేరు: మేనేజ్మెంట్ ట్రైనీ & అసిస్టెంట్ ఆఫీసర్.
మొత్తం ఖాళీలు: 77.
విభాగాల వారీగా ఖాళీలు
మేనేజ్మెంట్ ట్రైనీ: సీ & ఓ 25, అకౌంట్స్ 09, అకౌంట్స్/ కంప్లైయన్స్ 01, టెక్నికల్ 04, ఎంఐఎస్ 03, సివిల్ 02, పీ & ఏ 02.
అసిస్టెంట్ ఆఫీసర్: సీ & ఓ 20, అకౌంట్స్ 02, టెక్నికల్ 04, ఎంఐఎస్ 03, సివిల్ 03.
విద్యార్హతలు
మేనేజ్ మెంట్ ట్రైనీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్టీముల్లో డిగ్రీ, ఇంజినీరింగ్ (బీఈ/ బి.టెక్), పీజీ, ఎంబీఏ లేదా సీఏ/ సీఎంఏ వంటి ప్రొఫెషనల్ అర్హతలు ఉండాలి.
అసిస్టెంట్ ఆఫీసర్: సంబంధిత స్టీముల్లో డిగ్రీ లేదా సమాన ప్రొఫెషనల్ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి
మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు 18 నుంచి28 ఏళ్ల మధ్యలో ఉండాలి.
అసిస్టెంట్ ఆఫీసర్ (ఏఓ) పోస్టులకు18 నుంచి32 ఏళ్ల మధ్యలోఉండాలి.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇతర రిజర్వుడ్ వర్గాల అభ్యర్థులకు వయసు సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
: అప్లికేషన్ ప్రారంభం ఆగస్టు 31.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 30.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ concorindia.co.inను సందర్శించండి.
