తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకాల అమలును నిలిపివేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే ను డివిజన్ బెంచ్ ఎత్తివేసింది.
2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ తీర్పు వెలువడింది. ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయడానికి అవకాశం ఇవ్వకుండా సింగిల్ జడ్జి స్టే ఇవ్వడాన్ని ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాలు చేసింది.
ALSO READ : ఢిల్లీకి వెళ్లిన మంత్రి కొండా సురేఖ
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌కు ఈ పథకాలతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని, సుప్రీంకోర్టు కూడా ఇలాంటి సంక్షేమ పథకాలను అనుమతించిందని కోర్టుకు తెలిపారు. రాజ్యాంగంలోని అధికరణ 162 కింద ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చని, అధికరణ 15(3) ప్రకారం మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టే అవకాశం ఉందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఏజీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పేద ఆడపిల్లల వివాహాలకు సర్కారు నుంచి అందే ఆర్థిక సాయానికి అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి.
