హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ పంచాయతీ ఢిల్లీకి చేరింది. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుమేరకు మంత్రి కొండా సురేఖ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. అధిష్టానాన్ని కలవాలని చెప్పడంతో హుటాహుటిన కొండాసురేఖ ఢిల్లీకి వెళ్లారు. మంత్రి కొండాసురేఖపై అధిష్టానం వేటు వేస్తుంది.. ఆమె మంత్రి పదవి పోయే అవకాశాలున్నాయని వస్తున్న వార్తల క్రమంలో ఈ రోజు సాయంత్రానికి అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.
గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం కలకలం రేపుతోంది. కొండా సురేఖ వ్యాఖ్యలతో కాంగ్రెస్ లోని మిగతా నేతలు ఆమెపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకూడా కొండా సురేఖపై నివేధికను అధిష్టానానికి అందజేసింది. ఈ సమయంలో మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఏం నిర్ణయం తీసుకుంటుదనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సహామంత్రులు రాజధానికి బాటపట్టారు. రెండు రోజుల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ లు కూడా మంగళవారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ వార్తలు వస్తున్న కమ్రంలో రాజధాని లో తిష్ట వేసి మంత్రి పదవులకోసం లాబీయింగ్ చేస్తున్నారు.
అంతకుముందు మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ కార్యదర్శి కేసి వేణుగోపాల్ అపాయింట్మెంట్ కోరడంతో ఢిల్లీ వచ్చి కలవాలని చెప్పడంతో హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు కొండా సురేఖ.
