జ్యోతిష్యం: సెప్టెంబర్: మకరరాశి వారు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి..లేకపోతే జరిగేది ఇదే..!

జ్యోతిష్యం: సెప్టెంబర్: మకరరాశి వారు  ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి..లేకపోతే జరిగేది ఇదే..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 సెప్టెంబర్​ నెలలో కీలక గ్రహాలు స్థానాలు మారబోతున్నాయి.  దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.ఈ నెలలో మకర రాశి వారి జీవితంలో  అనేక  పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలున్నాయి. శని మీన రాశిలో వక్రగతిలో, రాహువు కుంభంలో, కేతువు సింహ రాశిలో సంచరిస్తున్నారు.  గ్రహాల సంచారం.. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారంగా ఈ నెలలో మకరరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . .! 

సెప్టెంబర్​ లో స్థానాలు మారుతున్ర గ్రహాలు

  • సెప్టెంబర్ 2:   తులా రాశిలోకి శుక్రుడు
  •  సెప్టెంబర్ 7: కన్యారాశిలోకి బుధుడు 
  •  సెప్టెంబర్ 17:   కన్యారాశిలోకి  సూర్యుడు
  •  సెప్టెంబర్ 18:  కర్కాటక రాశిలోకి కుజుడు 
  •  సెప్టెంబర్ 26: తులా రాశిలోకి  బుధుడు 

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నెల ( 2026సెప్టెంబర్​)  మకర రాశి వారు వ్యక్తిగతంగా కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని పండితులు చెబుతున్నారు. కీలక గ్రహాల సంచారంలో మార్పు వలన ఏ విషయంలో కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని సూచిస్తున్నారు. కోపాన్ని.. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి.  కుజుడు చెడు దృష్టి వలన  తెలియని ఆందోళన, భయం కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు

మకరరాశి వారు  సెప్టెంబర్​ 2026 లో ఎవరికి ఎలాంటి హామీలు చేయడం.. వాగ్ధానాలు ఇవ్వడం వంటివి చేయకపోవడం చాలా మంచిది.ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఉద్యోగం మారే ప్రయత్నా లకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లలు కొద్ది శ్రమతో ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.

మకర రాశి వారికి ఈ నెలలో  సూర్యుడు, శుక్రుడు  అనుకూలత వల్ల చాలావరకు సంతృప్తికరంగాఉంటుంది. ఉద్యోగస్తులకు చివరి 15 రోజులు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చేతి వృత్తుల వారికి  ఆశించిన స్థాయిలో సంపాదన వృద్ధి చెందుతుంది. కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టే అవకాశం ఉంది.  మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది.

ALSO READ : జ్యోతిష్యం: సెప్టెంబర్ నెల.. ధనస్సు రాశి వారికి గ్రహాలు అనుకూలం..

వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు.  ఇక పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూసే వారికి ఉన్నత కుటుంబానికి చెందిన వారితో సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొన్ని విషయాలలో అపార్థాలు తొలగిపోయి, బంధాలు బలపడతాయి . వాదనలకు దూరంగా ఉండటం ...భాగస్వామితో సర్దుకుపోవడం వల్ల ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. మిత్రుల మూలంగా కొద్దిగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది.  

పరిహారం:  ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల దోషాలు తొలగి శుభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.