మరికొద్ది రోజుల్లో యూఎస్ ఓపెన్ 2026 ఫైనల్ ఉన్న క్రమంలో.. అటు ప్లేయర్స్ తో పాటు ఇటు ఫ్యాన్స్ లోనూ ఎమోషన్స్ హై లో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతీ మ్యాచ్ చాలా ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. అయితే 2026 ఆగస్టు 31న జరిగిన మ్యాచ్ లో వైరల్ మూమెంట్స్ కు సంబంధించిన వీడియో చూసి.. ఈ ఏడాదిలేనే ఇది బెస్ట్ వీడియో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు స్పోర్ట్స్ సర్కిల్ లో వైరల్ గా మారింది.
సోమవారం జరిగిన మ్యాచ్ లో అమెరికాకు చెందిన ఆమ్మా నవరో, ఫ్రాన్స్ కు చెందిన లుయిస్ బాయిసన్ కు మధ్య చాలా టఫ్ ఫైట్ నడించింది. ఈ మ్యాచ తర్వాత ఇద్దరు ప్లేయర్స్ ఎమోషన్స్ చర్చనీయాంశంగా మారాయి. ఇద్దరు ప్లేయర్ల మూడ్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు.
ఈ మ్యాచ్ లో 7–6,6–7,6–3 తేడాతో గెలిచిన నవరో.. కోర్టు ఒక ఎండ్ లో సెలబ్రేట్ చేసుకుంటుండగా.. మరో కోర్టులో మీటర్ దూరంలోనే బాయిసన్ చిరాకుతో తన రాకెట్ ను నేలకేసి ఫటా ఫటా కొట్టడం.. ఒకే సారి రెండు మూమెంట్స్ ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరు హ్యాండ్స్ షేక్ చేసుకున్న తర్వాత.. ఈ ఎమోషన్స్ బయట పడటం ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఒకవైపు నవరో సెలబ్రేట్ చేసుకుంటుంటే అదే సమయంలో.. కంటిన్యూగా రాకెట్ ను నేలకేసి కొట్టడం చూసి ఫ్యాన్స్ స్టన్నయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది.
This has to be the best video of this year's #USOpen so far 🤭 Emma Navarro celebrating her win, while Boisson is going gung-ho on her racket in the background. 💀😭 pic.twitter.com/arvAgdfX2V
— @PaddyPOV (@PaddyPOV) August 31, 2026
ఫస్ట్ రౌండ్ లో అల్కరాజ్, సబలెంకా గెలుపు:
మరోవైపు మెన్స్ సింగిల్స్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ ఫస్ట్ రౌండ్ లో రోమన్ సఫియులిన్ పై 6–4,6–4, 6–4 తేడాతో గెలుపొందాడు. ఇక వుమెన్స్ పోటీలో అర్యానా సబలెంకా గెలుపొందింది. కెమిలా ఆస్కార్ పై 6–4,6–4, తేడాతో గెలుపొందింది.
