సేమ్యాతో నోరూరించే స్వీట్లతో పాటు గరంగరం పకోడీలు, కమ్మని పులిహార వండుకుని తిందాం, ఇవే కాదు సేమ్యాతో ఇంకా బోలెడు వెరైటీ రెసిపీలు వండేయొచ్చు.
వెజ్ పకోడి
కావాల్సినవి:
- ఉడికించిన సేమ్యా - అర కప్పు
- క్యారెట్ ముక్కలు (సన్నగా తరగాలి)-రెండు టీ స్పూన్లు
- బీన్స్ తరుగు- పావు కప్పు
- కొత్తిమీర, పుదీనా తరుగు - కొద్దిగా
- శెనగపిండి- అర కప్పు
- బియ్యప్పిండి- పావు కప్పం
- కరివేపాకు తరుగు- ఒక టీస్పూన్
- ఉల్లిగడ్డ తరుగు - అర టేబుల్ స్పూన్
- ఉప్పు, కారం- తగినంత.
- చాట్ మసాలా- ఒక టీ స్పూన్
- నూనె-- వేగించడానికి పరచడా
- పచ్చిమిర్చి తరుగు - రెండు టీ మ్యాన్ లు,
తయారీ
ఒక గిన్నెలో క్యారెట్ ముక్కలు, దీన్ని, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి ఉల్లిగడ్డ తరుగు వేసి బాగా కలపాలి. అందులో ఉడికించిన సేమ్యా. శనగపిండి బియ్యప్పిండి, కారం, ఉప్పు, -చాట్ మసాలా కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడి పిండిలా కలపాలి. మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీ వేసి డీప్ ఫ్రై చేయాలి.
ALSO READ : రోజంతా హెల్దీగా యాక్టివ్ గా ఉండాలంటే...
దోస
కావాల్సినవి:
- సేమ్యా- రెండు కప్పులు:
- బియ్యప్పిండి- ఒక కప్పు,
- బొంబాయి రవ్వ - ఒక కప్పు,
- పుల్ల దుజ్జిగ- ఒక కప్పు,
- జీలకర్ర - ఒకటి స్పూన్,
- ఉప్పు- తగినంత,
- నూనె - సరిపడా
తయారీ
గిన్నెలో సేమ్యా, బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, పుల్ల మజ్జిగ, జీలకర్ర, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి దోశపిండిలా కలపాలి. ఆ మిశ్రమాన్ని గంటపాటు తాకకుండా పక్కనుంచాలి. ఆ తర్వాత స్టవ్ పై పెనం పెట్టి కొద్దిగా నూనె వేసి రెడీ చేసిన పిండితో దోసెలు వేయాలి.
సేమ్యా బర్ఫీ
కావాల్సినవి:
- సేమ్యా-రెండు కప్పులు
- పంచదార- ఒకటిన్నర కప్పు
- కొబ్బరి తరుము- అర కప్పు
- పాలు - ఒక కప్పు
- జీడిపప్పు, కిస్మిస్-నాలుగు టీ స్పూన్ లు
- యాలకుల పొడి- అర టీ స్పూన్
- నెయ్యి- మూడు టీ స్పూన్ లు
తయారీ:
పాన్లో నెయ్యి కరిగించి సేమ్యా, వేసి గోధుమరంగులోకి వచ్చే వరకు వేగించాలి. తర్వాత అదే పాన్లో పప్పు, కిస్మిస్ కూడా వేసి వేగించాలి. ఒక గిన్నెలో పాలు పోసి స్టవ్ పై పెట్టి సన్నని మంటపై వేడిచేయాలి. కాస్త మరిగాక పంచదార వేసి బాగా కలపాలి. అందులో వేగించిన సేమ్యా కొబ్బరి తరుము, యాలకుల పొడి వేసి వెమ్మదిగా కలుపుతూ ఇంకాసేపు మరిగించాలి. తర్వాత వెడల్పాటి ప్లేట్ తీసుకుని నెయ్యి రాసి అందులో సేమ్యా మిశ్రమాన్ని సమంగా పరచాలి. చల్లారాక బర్ఫీ షేప్ లో కట్ చేయాలి. చివరిగా వేగించిన జీడిపప్పు, కిస్మిస్ తో గార్నిష్ చేయాలి.
సేమ్యా పులిహోర
కావాల్సినవి:
- సేమ్యా- ఒక కప్పు
- పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు
- పోవుదినుసులు- ఒక టీస్పూన్
- కరివేపాకు- రెండు రెమ్మలు
- ఇంగువ, పసుపు- చిటికడు
- ఉప్పు- తగినంత
- నిమ్మరసం- ఒక టీ స్పూన్
- నూనె- రెండు టేబుల్ స్పూన్ల
- జీడిపప్పు - రెండు టీ స్పూన్లు
తయారీ:
పాన్ లో నూనె వేడి చేసి సేమ్యా వేగించాలి..సేమ్యా కాస్త రంగు మారాక సరిపడా నీళ్లుపోసి ఉడికించాలి.మరొక పాన్లో నూనె వేడిచేసి ఎండుమిర్చి, పోపు దినుసులు, పచ్చిమిర్చి తరుగు, కరివే పాకు, ఇంగువ వేసి వేగించాలి. అందులో..జీడిపప్పు, ఉప్పు, పసుపు కూడా వేసిమరికాసేపు వేగించాలి. తర్వాత ముందుగా ఉడికించిన సేమ్యా వేసి బాగా కలపాలి. చివరిగా నిమ్మరసం పిండి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే యమ్మీయమ్మీ సేమ్యా పులిహోర రెడీ..
పన్నీర్ సేమ్యా బిరియానీ
కావాల్సినవి:
- వేగించినసేమ్యా- ఒక కప్పు,
- పన్నీర్ ముక్కలు-ఒక కప్పు,
- క్యారెటీ తరుగు-అర కప్పు
- పచ్చిమిర్చి తరుగు- మూడు టీ స్పూన్లు
- మసాలా దినుసులు- కొద్దిగా
- బిరియానీ ఆకు-ఒకటి
- ఉల్లిగడ్డ తరుగు - అర టేబుల్ స్పూన్
- మసాలా పేస్ట్- ఒక టీ స్పూన్
- డాల్డా/నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
- అలుగడ్డ తరుగు - అర కప్పు
- పసుపు - చిటికెడు
- నూనె- మూడు టేబుల్ స్పూన్లు
- జీడిపప్పు, కొత్తిమీర - కొద్దిగా
- ఉప్పు- తగినంత
తయారీ:
పాన్లో నూనె వేడి చేసి పన్నీర్ ముక్కలు వేసి వేగించాలి. తర్వాత వాటిని పసుపు. ఉప్పు కలిపిన నీళ్లలో నానబెట్టాలి. ఇప్పుడు అదే పాన్లో డాల్డా లేదా నెయ్యి, జీడిపప్పు వేసి రెండునిమిషాలు వేగించి గిన్నెలోకి తీయాలి. తర్వాత అదే పాన్లో సరిపడా నూనె వేసి ఉల్లి గడ్డ, పచ్చిమిర్చి, అలుగడ్డ క్యారెట్ తరుగు పసుపు, మసాలా పేస్ట్, ఉప్పు వేసి వేగించాలి. అందులో వేగించిన సేమ్యా వేసి సరిపడా మరిగించిన నీళ్లు పోసి ఉడికించాలి. ఆ మిశ్రమంలో బిరియానీ ఆకు, కొత్తిమీద. తరుగు, వేగించిన జీడిపప్పు కూడా వేసి ఇంకాసేపు ఉడికించాలి. చివరిగా వేగించి నానబెట్టిన పనీర్ ముక్కలు వేసి కాస్త దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేయాలి
