చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి లక్ష్య సేన్ ఔట్

చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి లక్ష్య సేన్ ఔట్

బీజింగ్: చైనా మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ తీవ్రంగా నిరాశ పర్చాడు. టోర్నీ తొలి రౌండ్‌లోనే కెనడాకు చెందిన విక్టర్ లాయ్ చేతిలో తేడాతో ఓటమి పాలై ఇంటిబాట పట్టాడు. బుధవారం (సెప్టెంబర్ 2) పెన్‎జెన్ వేదికగా జరిగిన ఈ పోరులో ప్రపంచ ర్యాంకింగ్‌లో తొమ్మిదో స్థానంలో విక్టర్ కేవలం 38 నిమిషాల్లోనే 14-21, 7-21 తేడాతో భారత షట్లర్‎ను మట్టికరిపించాడు. 

భారత షట్లర్ లక్ష్య సేన్ 4-0 ఆధిక్యంతో గేమ్‎ను ఘనంగా ఆరంభించాడు. కానీ చివరి వరకు ఆ ఊపును నిలబెట్టుకోలేకపోయాడు. విక్టర్ లాయ్ బలంగా తిరిగి పుంజుకున్నాడు. వ్యూహాత్మక డిఫెన్స్‎తో భారత ఆటగాడిని ఒత్తిడిలోకి నెట్టాడు. దీంతో లక్ష్యసేన్ ర్యాలీలను ఛేదించడానికి ఇబ్బంది పడుతూ మరింత ఎక్కువగా రిస్క్ తీసుకోవడం ప్రారంభించాడు. సేన్ పదేపదే బ్యాక్‌హ్యాండ్ సైడ్‌లైన్ వైపు షాట్లు మిస్ చేస్తుండటంతో ఒత్తిడి మరింత తీవ్రమైంది. లాయ్ ఆ పొరపాట్లను తనకు అనుకూలంగా మలుచుకుని తొలి గేమ్‌ను 21-14 తేడాతో గెలుపొందాడు.

►ALSO READ | సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న రెండో సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో.. ‌‌‌‌నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 256/7

తొలి రౌండ్ కోల్పోయిన లక్ష్య సేన్‎కు రెండో రౌండ్‎లో తిరిగి కోలుకునే అవకాశమే లేకుండా పోయింది. బలమైన అటాకింగ్, డిఫెన్స్ గేమ్‎తో విక్టర్ లాయ్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు.  4-11తో వెనకబడ్డ లక్ష్యసేన్ పాయింట్ల అంతరాన్ని పూడ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ క్రమంలో మరిన్ని అనవసర తప్పిదాలు చేసి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. కెనడియన్ ఆటగాడు రెండో గేమ్‌ను 21-7 తేడాతో కైవసం చేసుకున్నాడు. దీంతో తొలి రౌండ్ లోనే భారత ఆటగాడు టోర్నీ నుంచి నిష్క్రమించాడు. 


  
 

మరిన్ని వార్తలు