సిడ్నీ: జింబాబ్వే, సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌ల కోసం 17 మంది సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా జట్టును మంగళవారం ప్రకటించారు. స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ జట్టులో చోటు దక్కలేదు. కెప్టెన్ మిచెల్ మార్ష్, ఓపెనర్ ట్రావిస్ హెడ్ టీమ్‌లోకి పునరాగమనం చేశారు. ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లు ఆస్ట్రేలియాకు అత్యంత కీలకం కానున్నాయి.
ఆస్ట్రేలియా వన్డే జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ (సౌతాఫ్రికాతో సిరీస్‌కు మాత్రమే), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కేరీ, కూపర్ కనోలీ, జోయెల్ డేవిస్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, ఒలివర్ పీక్, మాథ్యూ రెన్‌షా, బిల్లీ స్టాన్‌లేక్, ఆడమ్ జంపా.
