ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెజాన్ కంపెనీ ఓనర్ జెఫ్ బెజోస్ మరోసారి తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఇప్పటికే మియామీలో కోట్లాది రూపాయల ఆస్తులను కలిగి ఉన్న ఆయన.. తాజాగా ఫ్లోరిడాలోని గోల్డెన్ బీచ్ ప్రాంతంలో ఏకంగా 69.5 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.660 కోట్ల విలువైన బీచ్ వ్యూ ప్రాపర్టీని కొనుగోలు చేశారని సమాచారం.
డెలావేర్ రాష్ట్రానికి చెందిన ఒక ఎల్ఎల్సి ద్వారా ఈ కొనుగోలు జరగడంతో కొనుగోలుదారు పేరు అధికారికంగా బయటకు రాలేదు. అయితే రియల్ ఎస్టేట్ నిపుణులు మాత్రం ఈ భారీ బీచ్ హౌస్‌ను కొనుగోలు చేసింది జెఫ్ బెజోసేనని బలంగా చెబుతున్నారు. 17,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అల్ట్రా-లగ్జరీ భవనంలో 7 బెడ్రూమ్లు, 12 బాత్రూమ్లు, గెస్ట్‌హౌస్, స్విమ్మింగ్ పూల్, స్పా వంటి సకల సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా సముద్ర తీరానికి నేరుగా 100 అడుగుల ఫ్రంటేజ్ ఉండటం దీని ప్రత్యేకత.
మియామీలోని 'బిలియనీర్స్ బంకర్' అని పిలువబడే ఇండియన్ క్రీక్ ప్రాంతంలో బెజెస్కు ఇప్పటికే రూ.2వేల250 కోట్లు విలువైన ప్రాపర్టీ ఉంది. అక్కడి నుంచి కేవలం 30 నిమిషాల ప్రయాణ దూరంలోనే ఈ కొత్త బీచ్ హౌస్ ఉండటం గమనార్హం. కేవలం ప్రైవసీ కోసమే కాకుండా.. సముద్ర తీరానికి డైరెక్ట్ యాక్సెస్ పొందేందుకు కుబేరులు ఇలాంటి విలాసవంతమైన ఆస్తులను తమ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకుంటుంటారని నిపుణులు వివరిస్తున్నారు.
అమెజాన్ మెయిన్ ఆఫీసు ఉన్న సియాటెల్ నుంచి 2023లో ఫ్లోరిడాకు మారిన బెజోస్.. తన తల్లిదండ్రులకు దగ్గరగా ఉండటంతో పాటు, కేప్ కెనావెరాల్‌లోని తన బ్లూ ఆరిజిన్ అంతరిక్ష కార్యకలాపాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఫ్లోరిడా రాష్ట్రంలో వ్యక్తిగత ఆదాయ పన్ను, క్యాపిటల్ గెయిన్స్ పన్నులు లేకపోవడం వల్ల ఆయనకు వేల కోట్ల రూపాయల పన్ను ఆదా అవుతోంది. ఏదేమైనా బెజోస్ చేసిన కొత్త ప్రాపర్టీ కొనుగోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కొత్తగా 10 తెలుగు, 10 ఇంగ్లీష్ టైటిల్స్, 12 ఇంగ్లీష్ ఎస్ఈఓ కీవర్డ్స్ కామాలతో
